LPG Cylinder Prices : గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. వరుసగా రెండోసారి పెరిగిన ధర

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. 19కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను .,

LPG Cylinder Prices : గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. వరుసగా రెండోసారి పెరిగిన ధర

Gas cylinder

LPG Cylinder Price Hiked : కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్. 19కేజీల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. సిలీండర్ పై రూ. 39 పెంచుతున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. డొమెస్టిక్ (గృహ అవసరాలకు వినియోగించే) సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. పెరిగిన కొత్త ధరలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. అంతకుముందు ఆగస్టు నెలలో కూడా ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఆ సమయంలో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.8.50 పెరిగింది.

Also Read : Gold Price today : తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్లో తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా?

తాజాగా పెరిగిన ధరల ప్రకారం.. 19కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో ప్రస్తుతం రూ. 1,652.50 ఉండగా.. పెరిగిన ధరతో కలుపుకొని రూ. 1,691కి చేరుకుంది.
హైదరాబాద్ నగరంలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలీండర్ పై రూ. 38 పెరిగింది. దీంతో హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం రూ.1,881 ఉండగా.. పెరిగిన ధరతో రూ. 1,919కి చేరింది.
విశాఖపట్ణణంలో కమర్షియల్ గ్యాస్ సిలీండర్ ధర రూ. 38 పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ సిలిండర్ ధర రూ. 1,712.50 ఉండగా.. పెరిగిన ధరతో రూ.1,750.50కి చేరింది.
విజయవాడ నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలీండర్ ధర రూ. 38 పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ సిలీండర్ ధర రూ. 1,841 ఉండగా.. పెరిగిన ధరతో రూ. 1,879కి చేరింది.

 

డొమెస్టిక్ (14.2 కేజీల గృహ వినియోగ సిలీండర్) గ్యాస్ సిలిండర్ ధరలో కొన్ని నెలలుగా ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 803గా ఉంది. హైదరాబాద్ లో రూ. 855, విశాఖ పట్టణంలో రూ. 812 అదేవిధంగా విజయవాడలో రూ. 844.50 గా ఉంది.