Ola electric Offers : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై స్పెషల్ డిస్కౌంట్లు.. రూ.25వేల వరకు ఆఫర్లు.. ఈ నెల 31 వరకు మాత్రమే..!
Ola electric Offers : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. వినియోగదారులను ఆకర్షించేందుకు తన లైనప్‌లో రూ. 25వేల వరకు విలువైన ఆఫర్‌లను అందిస్తోంది. జనవరి 31 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

Ola celebrates Republic Day with Unity Heritage Ride, offers worth up to Rs. 25k
Ola electric Offers : ఓలా ఎలక్ట్రిక్ యూనిటీ హెరిటేజ్ రైడ్ బ్యానర్ కమ్యూనిటీ ప్రొగ్రామ్ కింద ఈవీ స్కూటర్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. S1 ప్రో, S1 ఎయిర్ కొనుగోలుపై ఎక్స్‌టెండెడ్ వారంటీపై 50శాతం తగ్గింపు అందిస్తోంది. S1 X+ కొనుగోలుపై రూ. 20వేలు ప్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. దేశీయ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓలా ఎలక్ట్రిక్ ఈ కమ్యూనిటీ ప్రొగ్రామ్ నిర్వహించింది.
ఈ రైడ్‌లో భాగంగా ఓలా కమ్యూనిటీకి చెందిన వందలాది మంది సభ్యులు భారత వారసత్వం, సంస్కృతిని ప్రోత్సహించడానికి విద్యుద్దీకరణ స్ఫూర్తితో దేశంలోని 26 నగరాల్లోని సమీప వారసత్వ ప్రదేశానికి వెళ్లారు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈవీకి మారడానికి భారత ఈవీ విప్లవంలో చేరడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది.
రూ.25వేల వరకు విలువైన ఆఫర్లు.. ఈ నెల 31 వరకు మాత్రమే :
ఇందులో భాగంగానే వినియోగదారులను ఆకర్షించేందుకు ఓలా స్కూటర్ లైనప్‌పై రూ. 25వేల వరకు విలువైన ఆఫర్‌లను అందిస్తోంది. జనవరి 31 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు.. కస్టమర్‌లు ఎక్స్‌టెండెడ్ వారంటీపై భారీగా 50శాతం డిస్కౌంట్, S1 ప్రో, S1 ఎయిర్ మోడల్‌లపై రూ. 2వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు.

Ola Republic Day Unity Heritage Ride offers
క్రెడిట్, ఈఎంఐలపై రూ. 5వేల వరకు తగ్గింపు :
కొనుగోలుదారులు ఎంచుకున్న క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై రూ. 5వేల వరకు తగ్గింపులను పొందవచ్చు. అయితే ఇతర ఫైనాన్స్ ఆఫర్‌లలో జీరో డౌన్ పేమెంట్, జీరో-ప్రాసెసింగ్ ఫీజు, 7.99శాతం తక్కువ వడ్డీ రేట్లు వంటి ఇతర డీల్‌లు ఉంటాయి. అదనంగా, S1 X+ కొనుగోలుపై రూ. 20వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా ఈ ఈవీ స్కూటర్ రూ. 89,999 వద్ద అందుబాటులో ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల తన స్కూటర్ పోర్ట్‌ఫోలియోలో 5 సరికొత్త ప్రొడక్టులను విస్తరించింది.
ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ S1 Pro (2వ జనరేషన్) ధర రూ. 1,47,499, అయితే S1 ఎయిర్ రూ. 1,19,999 వద్ద అందుబాటులో ఉంది. విభిన్న ప్రాధాన్యతలతో రైడర్‌ల అవసరాలను తీర్చడానికి అదనంగా S1Xని మొత్తం మూడు వేరియంట్‌లలో ప్రవేశపెట్టింది.
రూ. 999కే బుకింగ్ చేసుకోవచ్చు :
అందులో S1 X+, S1 X (3kWh), S1 X (2kWh), S1 X (3kWh), S1X (2kWh) కోసం రిజర్వేషన్ విండో కూడా తెరిచింది. ఎంట్రీ-లెవల్ S1 X విక్రయాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఇందులో రెండు వేరియంట్లలో కేవలం రూ. 999 టోకెన్ అమౌంట్ చెల్లించి మీకు నచ్చిన ఈవీ స్కూటర్ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ల ప్రారంభ ధరలు వరుసగా రూ. 89,999, రూ. 99,999 వరకు అందుబాటులో ఉంటాయి.
Our #Hyderabad community is all set for their ride. Guess where they’re going? #OlaUnityHeritageRide#CultureMeetsFuture#RepublicDay pic.twitter.com/HD7eEUW5jb
— Ola Electric (@OlaElectric) January 26, 2024