Ola Bijlee Dog Hire : కుక్కకు ఉద్యోగమిచ్చిన ఓలా.. ‘బిజిలీ’ ఐడీ కార్డు భలే ఉందిగా.. కంపెనీ సీఈఓ పోస్టు వైరల్..!

Ola Bijlee dog Hire : ఓలా కంపెనీ సీఈఓ సరికొత్త ఉద్యోగిని పరిచయం చేశారు. కుక్కకు బిజిలీ (Bijlee) అనే పేరు పెట్టి మరి తన కంపెనీలో ఉద్యోగమిచ్చారు. ఈ కొత్త ఓలా ఉద్యోగికి అధికారిక Ola ఎలక్ట్రిక్ ID కార్డ్ మాత్రమే కాకుండా, ప్రత్యేక హోదా కూడా ఉంది.

Ola Bijlee Dog Hire : కుక్కకు ఉద్యోగమిచ్చిన ఓలా.. ‘బిజిలీ’ ఐడీ కార్డు భలే ఉందిగా.. కంపెనీ సీఈఓ పోస్టు వైరల్..!

Ola Electric CEO hires a dog as the company’s newest employee, shares ID with employment details

Updated On : August 2, 2023 / 3:02 PM IST

Ola Bijlee dog Hire : ప్రముఖ రైడ్-హెయిలింగ్ కంపెనీ ఓలా (Ola) కొత్త ఉద్యోగిని నియమించుకుంది. అది కుక్క (Dog). అదేంటీ కుక్కకు ఉద్యోగం ఇవ్వడమేంటి? అని ఆశ్చర్యంగా ఉందా? అవును.. మీరు చదివింది నిజమే.. ఓలా వ్యవస్థాపకుడు CEO అయిన భవిష్ అగర్వాల్ (Bhavish Aggarwal) తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికగా ఇదే విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు.. ఈ కుక్కకు బిజిలీ (Bijlee) అని పేరు కూడా పెట్టారు. కంపెనీలో కొత్తగా చేరిన కుక్కకు ఓలా ఎలక్ట్రిక్ ఐడీ కార్డును కూడా జారీ చేసినట్టు అగర్వాల్ తెలిపారు.

ఈ రిక్రూట్‌మెంట్‌కు ఇంత ప్రత్యేకత ఏమిటంటే.. Bijlee అంటే.. హిందీలో విద్యుత్ (Electricity). అది కంపెనీ EV (ఎలక్ట్రిక్ వాహనం) వ్యాపారాన్ని సూచిస్తుంది. ఇది సరదాగా మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే.. కుక్క మనుషుల మాదిరిగా పనిచేయలేదు.. ఓలాను ఫ్రెండ్లీ సంస్థగా మార్చాలనే ఆలోచనలో భాగంగానే అగర్వాల్ ఇలా పోస్టును పెట్టి ఉండవచ్చు.

Read Also : Flipkart Big Saving Days Sale : ఆగస్టు 4 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌.. ఐఫోన్ 14, శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!

ఇప్పుడు, ఈ పోస్ట్ ప్రకారం.. బిజిలీ ఓలా ఉద్యోగిగా గుర్తింపు పొందడమే కాకుండా ఎంప్లాయి IDతో పాటు సొంత ఓలా ఎలక్ట్రిక్ ID కార్డును కూడా పొందింది. కుక్క ఐడీ కార్డులో కూడా ప్రత్యేకత ఉంది. ఆసక్తికరంగా, బిజిలీ ID కార్డ్ ఫొటో సాధారణ ID కార్డ్ మాత్రమే కాదు.. ఇందులో కొన్ని ఆసక్తికరమైన వివరాలను కలిగి ఉంది. ఉదాహరణకు, కుక్క ఎంప్లాయ్ కోడ్ ‘440 V’ అని ఉంది. అంటే.. ఇది ఈవీ సిస్టమ్‌లోని ప్రామాణిక వోల్టేజ్‌ని సూచిస్తుంది. అదనంగా, కార్డ్‌లో బిజిలీ బ్లడ్ గ్రూప్‌ను ‘paw+ve’ అని రాసి ఉంది. కుక్క పాదాలను సూచిస్తూ ‘పాజిటివ్’ అనే పదాన్ని రాశారు.

ఇంకా, ఏదైనా అవసరం ఉంటే.. ఇన్‌స్టంట్ మెసేజ్ ప్లాట్‌ఫారమ్ ‘Slack’ ద్వారా (Bijlee)ని సంప్రదించవచ్చునని కార్డుపై వివరాల్లో రాసి ఉంది. అందులో ఎమర్జెన్సీ కాంటాక్టు సమాచారం కొరకు BA ఆఫీసు వివరాలను కూడా కలిగి ఉంది. బహుశా.. భావిష్ అగర్వాల్ పేరులోని మొదటి (BA) అక్షరాలను సూచించేలా ఉంది. కోరమంగళలోని హోసూర్ రోడ్‌లోని ఓలా ఎలక్ట్రిక్ టీమ్‌లో బిజిలీ గర్వించదగిన సభ్యుడు అని ID కార్డ్‌లోని అడ్రస్ సూచిస్తుంది. సోషల్ మీడియాలో ఈ ఫోస్టు తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది ఓలా కంపెనీని అభినందిస్తుంటే. మరికొందరు నెటిజన్లు ఓలా ఈవీ సర్వీసుపై పలు విమర్శలు చేస్తున్నారు.

Ola Electric CEO hires a dog as the company’s newest employee, shares ID with employment details

Ola Electric CEO hires a dog as the company’s newest employee, shares ID with employment details

ఏది ఏమైనా.. ఆఫీసులోకి పెంపుడు జంతువులను తీసుకురావడం ఎల్లప్పుడూ సానుకూల, ఆహ్లాదకరమైన పని వాతావరణాన్ని కలిగి ఉంటుందని అనేక కంపెనీలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ కుక్కలను అధికారికంగా తమ ఉద్యోగులుగా చేర్చుకుంటున్నాయి. ఓలా మాదిరిగానే InMobi, OnePlus India, Zerodha వంటి మునుపటి కంపెనీలు కూడా కుక్కలను దత్తత తీసుకున్నాయి. కంపెనీలో వాటికి ప్రత్యేక హోదాలను కేటాయించాయి. కొన్ని ఏళ్ల క్రితమే బ్రెజిల్‌లోని హ్యుందాయ్ షోరూమ్ ‘టక్సన్ ప్రైమ్’ (Tucson Prime) అనే కుక్కను నియమించుకుంది. కంపెనీ కుక్కను నియమించడమే కాకుండా.. బెస్ట్ ఫ్రెండ్ అయినందుకు ‘ఎంప్లాయీ ఆఫ్ ది ఇయర్’ బిరుదును కూడా ఇచ్చింది.

ఇటీవల, X (గతంలో Twitter) సీఈఓ ఎలన్ మస్క్ (Elon Musk) ఒక ఇంటర్వ్యూలో తన కుక్కను ట్విట్టర్ సీఈఓగా పరిచయం చేశాడు. ట్విట్టర్ సీఈఓ హోదాపై చర్చ జరుగుతున్నప్పుడు, మస్క్ తన పెంపుడు కుక్క (Floki), షిబా ఇనుని కొత్త సీఈఓగా పేర్కొన్నాడు. ‘ఇప్పుడు నేను ట్విట్టర్ సీఈఓ కాదు.. నా కుక్క ట్విట్టర్ CEO’ అని మస్క్ చమత్కరించాడు. సీఈఓల వంటి కార్పొరేట్ బిరుదులను మస్క్ ఎప్పుడూ విమర్శిస్తుంటాడు. తాను ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన సమయంలోనూ తన ట్విట్టర్ బయోని ‘చీఫ్ ట్విట్’ (chief twit)గా మార్చాడు.

Read Also : Ola Electric : జూలైలోనూ ఓలాదే ఆధిపత్యం.. ఈవీ మార్కెట్లో 40శాతం వాటాతో జోరుగా అమ్మకాలు..!