Ola Electric EC : దేశంలోనే అతిపెద్ద D2C ఆటోమొబైల్ రిటైల్ నెట్‌వర్క్.. శ్రీనగర్‌లో ఓలా 500వ ఎక్స్పీరియన్స్ సెంటర్..!
Ola Electric EC : భారత అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఓలా ఎలక్ట్రానిక్ (Ola) శ్రీనగర్‌లో 500వ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించింది. గత కొన్ని వారాల్లో 9 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లతో హైదరాబాద్‌లో తన నెట్‌వర్క్‌ను మూడింతలుగా విస్తరించింది.

Ola Electric _ Ola opens its 500th Experience Center in Srinagar
Ola Electric EC 500th Experience Center in Srinagar : భారత అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తమ మార్కెట్‌ను వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించిన ఓలా.. శ్రీనగర్‌లో మరో కొత్త ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించింది. దేశంలోనే అతిపెద్ద D2C (డైరెక్ట్ టు కన్స్యూమర్) నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రణాళికలో భాగంగా జమ్మూ & కశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలో తన 500వ ఎక్స్పీరియన్స్ సెంటర్ (EC)ని ఓలా ప్రారంభించింది. గత కొన్ని వారాలుగా ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను విస్తరించుకుంటూ ముందుకు దూసుకుపోతోంది.
గత కొన్ని వారాల్లో 9 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లతో హైదరాబాద్‌లో తన నెట్‌వర్క్‌ను మూడింతలుగా విస్తరించింది. గత ఏడాది పూణేలో మొట్టమొదటి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ (EC)ని ప్రారంభించిన ఓలా.. కేవలం ఎనిమిది నెలలలోపు దేశంలోని ఆటోమోటివ్ పరిశ్రమలో అతిపెద్ద D2C రిటైల్ నెట్‌వర్క్ నిర్మించింది. దాదాపు 300 నగరాల్లో ఓలా మార్కెట్‌ను భారీగా విస్తరించింది.

Ola Electric EC Ola opens its 500th Experience Center in Srinagar
ఓమ్నిచానెల్ వ్యూహం, ఆఫ్లైన్ విస్తరణ వేగంతో ఓలా దేశంలో దాదాపు అన్ని మార్కెట్లను కవర్ చేస్తూ 98శాతం మార్కెట్‌ను సాధించింది. ఇప్పటికే, శ్రీనగర్‌లో 500వ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన ఓలా.. ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశంలో ఈ సంఖ్యను వెయ్యికి చేర్చాలని కంపెనీ యోచిస్తోంది.
Read Also : Apple iPhone 15 Price : ఆపిల్ ఐఫోన్ 15 ధర ఎంతో తెలిసిందోచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు? లాంచ్ టైమ్ అప్పుడేనట..!
500వ స్టోర్ ప్రారంభించిన సీఈఓ అన్షుల్ :
ఓలా ఎలక్ట్రిక్ CMO అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ‘భారత్‌లో 500వ స్టోర్ ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. డైరెక్ట్-టు-కన్స్యూమర్ (D2C) విధానం ద్వారా దేశం అంతటా విజయవంతగా విస్తరించినందుకు గర్వపడుతున్నాం. ఈ మైలురాయి చేరుకోవడం ద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీని అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. ఓలా ఎలక్ట్రిక్ దేశంలో క్లీన్, స్టేబుల్‌గా ముందుకు సాగనుంది. ఈ 500వ స్టోర్ ప్రారంభంతో మరో విజయాన్ని సాధించాం. ఇంకా ముందున్న సవాళ్లను కూడా అధిగమించాల్సి ఉంది.

Ola Electric EC Ola opens its 500th Experience Center in Srinagar
D2C మోడల్ సాయంతో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో గణనీయమైన ప్రభావాన్ని సృష్టించే దిశగా ఓలా అడుగులు వేస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. ఓలా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన అన్ని విషయాలను ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల ఔత్సాహికులకు ఓలా ప్రపంచ స్థాయి ప్రొడక్టులను అందిస్తుంది. కొనుగోలు, ఫైనాన్సింగ్, అమ్మకాల తర్వాత సర్వీసులపై మార్గదర్శకత్వాన్ని ఈ సెంటర్లు అందిస్తాయి. ఓలా వాహనాలను కొనుగోలు చేసేముందు కొనుగోలుదారుల S1, S1 Pro టెస్ట్ రైడ్ కూడా తీసుకోవచ్చు.
ఆటోమొబైల్ రంగంలో D2C సేల్స్ & సర్వీస్ మోడల్‌ను భారత మార్కెట్లో తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది ఓలా. డోర్‌స్టెప్ డెలివరీ, సర్వీసింగ్ సేవలను కంపెనీ అందిస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 500 ECలను కలిగి ఉన్నప్పటికీ.. కంపెనీ విక్రయాలలో ఇప్పటికీ ఓలా వెబ్‌సైట్, యాప్స్ నుంచి ఎక్కువగా వస్తుంది. ఓలా ఓమ్నిచానెల్ విధానంతో భారత్ అంతటా ఎలక్ట్రిక్ వాహనాలను అందించనుంది. ఓలా ప్రస్తుతం భారత ద్విచక్ర ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో 40శాతం వాటాని స్వాధీనం చేసుకుంది. గత నెలలో ఓలా అత్యధిక నెలవారీ విక్రయాలను నమోదు చేసింది, 30వేల యూనిట్లకు పైగా విక్రయించింది. తద్వారా వరుసగా 8వ నెలలో EV 2W అమ్మకాల పట్టికలో ఓలా అగ్రస్థానంలో నిలిచింది.