Ola Bike: నేడే ఓలా బైక్ విడుదల.. ధర ఎంతంటే?
దేశంలో క్యాబ్‌లను నిర్వహిస్తున్న ఓలా సంస్థ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకుని వస్తోంది.

Ola Bike
Ola Electric S1 scooter: దేశంలో క్యాబ్‌లను నిర్వహిస్తున్న ఓలా సంస్థ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకుని వస్తోంది. ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీ బుకింగ్స్‌తోనే వరల్డ్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ లుక్‌ని ఓలా కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ ఇటీవల రివీల్ చేశారు. తమిళనాడులో ఉన్న ఫ్యాక్టరీలో తయారైన మొట్టమొదటి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫోటోని ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు. ఫిబ్రవరిలో స్కూటర్ తయారీ పనులు మొదలు పెట్టామని, కంపెనీ ఉద్యోగులు ఎంతో శ్రమించి స్కూటర్ తయారు చేసినట్లు వెల్లడించారు.
ఈ ఓలా బైక్ కోసం ఉత్సాహంగా ఉండటమే కాదు.. బైక్‌కి యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఓలా S-1 స్కూటీని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉండటానికి ఇదే కారణమని, ఓలా e-స్కూటర్ ఫీచర్లు మరియు ఇతర స్పెసిఫికేషన్‌లు నెమ్మదిగా తెరపైకి వస్తున్నాయి. ఇటీవల, OLA CEO భవిష్ అగర్వాల్ సోషల్ మీడియాలో 17 సెకన్ల వీడియోను విడుదల చేశారు.
ప్రారంభానికి ముందే, E-స్కూటర్ S-1 భారత్‌లో సందడి చేసింది. ఓలా ఎస్-1 బుకింగ్ ప్రారంభమైన తర్వాత 24 గంటల్లో లక్ష మందికి పైగా దీనిని బుక్ చేసుకున్నారు. ఇటీవల, ఓలా ఈ-స్కూటర్ ప్రత్యేక ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1 లక్షకు దగ్గరగా ఉంది. S-1 స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150కిమీ వరకు ప్రయాణిస్తుంది. ఓలా S-1 గరిష్ట వేగం గంటకు 90 కిమీ. ఇంట్లో సాధారణ ఎలక్ట్రికల్ సాకెట్ నుంచి కూడా స్కూటర్ ఛార్జ్ చేయవచ్చు.
18 నిమిషాల్లో సగం ఛార్జ్:
ఓలా e-స్కూటర్ ఎస్-1 కేవలం 18 నిమిషాల్లో 50శాతం ఛార్జ్ అవుతుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రాబోతోంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ అందించబడింది. బూట్ స్పేస్ పరంగా కూడా ఎస్-1 ఆకర్షణీయంగా ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బూట్ స్పేస్‌లో రెండు హెల్మెట్‌లను పెట్టుకోవచ్చు.
ఓలా S-1 హోమ్ డెలివరీ:
ఓలా తన e-స్కూటర్ ఎస్-1 హోమ్ డెలివరీని అందిస్తుంది. కంపెనీ నేరుగా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలుదారుల ఇంటికి అందిస్తుంది. S-1 కోసం ఓలా డైరెక్ట్-టు-కన్స్యూమర్ సేల్ మోడల్‌ను ఉపయోగిస్తుంది, కాబట్టి ఈ స్కూటర్ నేరుగా తయారీదారు నుంచి కొనుగోలుదారుకు వెళ్తుంది.
Built the first scooter in our Futurefactory today! From barren land in Feb to this in under 6 months despite a pandemic!! The @OlaElectric team is just amazing❤️?? pic.twitter.com/B0grjzWwVC
— Bhavish Aggarwal (@bhash) August 14, 2021