ITR: ఎన్ని కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి? గడువు ముగుస్తుండడంతో ఒక్క రోజులో ఎంతమంది వేశారో తెలుసా?

సోమవారంతో ఐటీఆర్ దాఖలుకు గడువు ముగుస్తుండడంతో ఆదివారం చాలా మంది వాటిని దాఖలు చేశారు.

ITR: ఎన్ని కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి? గడువు ముగుస్తుండడంతో ఒక్క రోజులో ఎంతమంది వేశారో తెలుసా?

ITR

Updated On : July 30, 2023 / 9:18 PM IST

ITR – Income Tax Department: ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ (Income-tax Returns)ను ఇప్పటివరకు ఎంతమంది దాఖలు చేశారన్న విషయంపై ఆదాయపన్ను శాఖ వివరాలు తెలిపింది. ఆదివారం సాయంత్రం 6.30 గంటలలోపు మొత్తం 6 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని పేర్కొంది.

సోమవారంతో ఐటీఆర్ దాఖలుకు గడువు ముగుస్తుండడంతో ఆదివారం చాలా మంది వాటిని దాఖలు చేశారు. ఆదివారం 26.76 లక్షల ఐటీఆర్లు దాఖలయ్యాయి. ఈ-ఫైలింగ్ పోర్టల్ లో ఆదివారం 1.30 కోట్ల మంది లాగిన్ అయ్యారని ఆదాయ పన్ను శాఖ పేర్కొంది.

ఐటీఆర్ దాఖలు విషయంలో ఏదైనా సాయం కావాలంటే తమకు ఏ సమయంలోనైనా చాట్ లేదా కాల్స్ చేయవచ్చని తెలిపింది. చివరి నిమిషంలో ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకోవాలని వీలైనంత త్వరగా ఐటీఆర్ దాఖలు చేసుకోవాలని కోరింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇప్పటికీ దాఖలు చేయనివారు వెంటనే ఆ పని పూర్తి చేయాలని పేర్కొంది.

OnePlus Nord CE 3 Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? ఆగస్టు 5న వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ సేల్.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!