పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఢిల్లీ: మొన్నటివరకు తగ్గుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా ఇంధన ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 19 పైసలు, డీజిల్‌పై 29 పైసలు పెరిగాయి. పెరిగిన ధరల తర్వాత..
* ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.69.26, డీజిల్ రూ.63.10
* ముంబైలో లీటర్ పెట్రోల్‌పై 19 పైసలు, డీజిల్‌పై 31 పైసలు పెంపు
* ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.74.91, డీజిల్ ధర రూ.66.04
* హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.73.27, డీజిల్ ధర రూ.68.28
* విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.73.15, డీజిల్ రూ.67.94
* గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.73.35, డీజిల్ ధర రూ.68.14
20 రోజుల వరకు స్థిరంగా ఉన్న ఇంధన ధరలు జనవరి 10వ తేదీ గురువారం స్వల్పంగా పెరిగాయి. జనవరి 11, 12వ తేదీల్లో కూడా ఇదే ట్రెండ్ నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకున్నా.. వారాంతంలో డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఆయిల్ కంపెనీలు ధరలు పెంచాయని తెలుస్తోంది.