మరో 3 బ్యాంకుల విలీనానికి రంగం సిధ్ధం

  • Published By: chvmurthy ,Published On : April 30, 2019 / 02:21 PM IST
మరో 3 బ్యాంకుల విలీనానికి రంగం సిధ్ధం

Updated On : May 28, 2020 / 3:40 PM IST

ఢిల్లీ : దేశంలో మరో 3 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసేందుకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ చర్చలు  జరుపుతోంది.  పంజాబ్ నేషనల్ బ్యాంకు,యూనియన్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా లను విలీనం చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విలీనం దిశగా ప్రభుత్వం బ్యాంకులతో చర్చలు జరుపుతోందని ఆర్ధిక శాఖ  అధికారి ఒకరు చెప్పారు.
Also Read : వామ్మో.. ఎంత పెద్దదో : నడిరోడ్డుపై భారీ అనకొండ.. ట్రాఫిక్ జామ్

గతంలో దేనా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా,  విజయ బ్యాంకుల విలీనం గతేడాది అక్టోబరు లో మొదలై ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. విలీనం తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా  దేశంలో అతి పెద్ద మూడవ బ్యాంకుగా అవతరించింది. ప్రస్తుతం పీఎన్బీ,యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియాల విలీనం ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం రెండు లేదా మూడవ త్రైమాసికంలో పూర్తి అవ్వచ్చని తెలుస్తోంది.  అలాగే బ్యాంకులు  విలీనానికిసంబంధించి తగిన ప్రతిపాదనలు​ ఇవ్వడంలో విఫలమైతే, ప్రత్యామ్నాయ విధానం (alternate mechanism) గ్రూప్ తగిన సలహాలను ఇస్తుందని ఆయన మీడియాకు  చెప్పారు.
Also Read : తన ప్రేమని తనే చంపేసుకున్నాడు : ఇదేం టీజర్ బాబోయ్!