Raksha Bandhan 2025 : రక్షా బంధన్ 2025.. మీ సోదరుడి కోసం రూ. 5వేల లోపు ధరలో 7 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు.. ఏ వాచ్ గిఫ్ట్ ఇస్తారంటే?
Raksha Bandhan 2025 : ఈ రక్షా బంధన్ 2025కి మీ సోదరుడికి స్టైల్, హెల్త్ కోసం రూ. 5వేల లోపు ధరలో 7 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లను గిఫ్ట్ ఇవ్వొచ్చు..

Raksha Bandhan 2025
Raksha Bandhan 2025 : రక్షా బంధన్ 2025 వస్తోంది. కొత్త స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నారా? మీ సోదరుడికి రక్షా బంధన్ గిఫ్ట్ స్మార్ట్‌వాచ్ (Raksha Bandhan 2025) ఇస్తారా? అయితే, రూ. 5వేల లోపు ధరలో 7 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. స్టైల్, ఫిట్‌నెస్ ఫీచర్లు, స్మార్ట్ కనెక్టివిటీలతో అద్భుతంగా ఉన్నాయి.
రోజువారీ వినియోగానికి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. హెల్త్ ట్రాకింగ్ కోసమే కాదు.. ఎంతో స్టైలిష్‌గా కనిపించేలా ఉంటాయి. ఈ కింది 7 స్మార్ట్ వాచ్‌లలో మీ సోదరుడికి ఏ స్మార్ట్ వాచ్ ఇస్తే బాగుంటుందో మీరే డిసైడ్ చేసుకోండి..
నాయిస్ కలర్ ఫిట్ ప్రో 5 మ్యాక్స్ (రూ. 3,999) :
నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 5 మ్యాక్స్ 1.96-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 7 రోజుల బ్యాటరీ లైఫ్, 30 రోజుల వరకు స్టాండ్‌బై మోడ్ అందిస్తుంది. ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు 2 గంటలు సమయం పడుతుంది. బ్లూటూత్ కాలింగ్, VO2 మ్యాక్స్, వర్కౌట్ యానాలిసిస్, ఫాస్ట్ హెల్త్ ట్రాకింగ్ వంటి ముఖ్య ఫీచర్లు ఉన్నాయి.
CMF బై నథింగ్ వాచ్ ప్రో 2 (రూ. 4,870) :
నథింగ్ వాచ్ ప్రో 2 ద్వారా CMF 1.32-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, ఆటో-బ్రైట్‌నెస్, గెచర్ కంట్రోలింగ్ కలిగి ఉంది. 3D వార్మప్ వైడ్ మోడ్, ఇంటర్నల్ GPS కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ స్మార్ట్ ట్రాకింగ్, స్టైలిష్ లుక్‌లతో యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
క్రాస్‌బీట్స్ నెక్సస్ (రూ. 3,994) :
క్రాస్‌బీట్స్ నెక్సస్ పెద్ద 2.01-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. బ్లూటూత్ 5.3 కాలింగ్‌కు సపోర్టు ఇస్తుంది. స్మార్ట్ అసిస్టెన్స్ కోసం ఇంటర్నల్ ChatGPT కలిగి ఉంది. డైనమిక్ ఐలాండ్, ఆన్‌లో ఉండే డిస్‌ప్లే, ఇన్-యాప్ GPS, ఏఐ హెల్త్ ట్రాకర్ వంటి ఫీచర్లను పొందవచ్చు.
ఫాస్ట్రాక్ ఆస్టర్ FS1 ప్రో స్మార్ట్ వాచ్ (రూ. 2,099) :
ఫాస్ట్రాక్ ఆస్టర్ FS1 ప్రో బ్లూటూత్ కాలింగ్‌తో కూడిన పెద్ద 1.97-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇందులో 100 కన్నా ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు, SpO2, హార్ట్ రేట్ మానిటరింగ్, ఉమెన్ హెల్త్ ట్రాకింగ్, IP68 వాటర్ రెసిస్టెన్స్, 5 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉన్నాయి.
గోబౌల్ట్ క్రౌన్ R ప్రో స్మార్ట్ వాచ్ (రూ. 1,799) :
గోబౌల్ట్ (GOBOULT) క్రౌన్ R ప్రో 1.43-అంగుళాల HD అమోల్డ్ స్క్రీన్ 600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. ఇందులో బ్లూటూత్ కాలింగ్, వర్కింగ్ క్రౌన్, జింక్ అల్లాయ్ ఫ్రేమ్, ఏఐ వాయిస్ అసిస్టెంట్, SpO2 మానిటరింగ్, 120+ స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్టు ఇస్తుంది.
టైటాన్ స్మార్ట్ 3 (రూ. 4,999) :
టైటాన్ స్మార్ట్ 3 వాచ్ 1.96-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. సింగిల్‌సింక్ బ్లూటూత్ కాలింగ్, 110+ స్పోర్ట్స్ మోడ్‌లు, 200+ వాచ్ ఫేస్‌లకు సపోర్టు ఇస్తుంది.
నాయిస్ హాలో 2 (రూ. 4,499) :
నాయిస్ హాలో 2 స్మార్ట్‌వాచ్ 1.43-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, స్టెయిన్‌లెస్ స్టీల్ బిల్డ్‌తో వస్తుంది. ఇందులో యాక్స్-కట్ బెజెల్‌తో ఫస్ట్ ఫంక్షనల్ రొటేటింగ్ డయల్, కస్టమ్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉన్నాయి.