RBI: హోమ్ లోన్ కస్టమర్లకు ఆర్బీఐ రిలీఫ్.. ఫ్లోటింగ్ వడ్డీ నుంచి ఫిక్స్డ్ వడ్డీకి మారొచ్చు..

గృహ రుణాల వడ్డీ రేట్లు పెరిగినప్పుడల్లా బ్యాంకులు చెల్లించాల్సిన ఈఎంఐల కాలవ్యవధిని పెంచుతుంటాయి. కనీసం కస్టమర్లకు సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఇదిగో ఇప్పుడు వీటికి చెక్ పెట్టనుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

RBI: హోమ్ లోన్ కస్టమర్లకు ఆర్బీఐ రిలీఫ్.. ఫ్లోటింగ్ వడ్డీ నుంచి ఫిక్స్డ్ వడ్డీకి మారొచ్చు..

RBI Good News for Home Loan Customers

RBI Good News: హోమ్ లోన్ (Home Loan) తీసుకున్నప్పటి నుంచి తిరిగి రుణం చెల్లించే వరకు కొనుగోలుదారుల ప్రయాస వర్ణణాతీతం. ఇక వడ్డీ రేట్లు (interest rates) పెరిగినప్పుడల్లా ఈఎంఐలు (EMI) పెరగడం వారికి మరో భారంగా చెప్పొచ్చు. అయితే ఇకపై వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (reserve bank of india). ప్రస్తుతం ఉన్న ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల విధానం (Floating Interest Rate) నుంచి ఫిక్స్డ్ వడ్డీ రేట్ల విధానంలోకి (Fixed Interest Rate) మారేందుకు హోమ్ లోన్ కస్టమర్లకు అవకాశం కల్పించనుంది ఆర్బీఐ.

సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు చాలా మంది పైసా పైసా కూడబెట్టి, దానికి తోడు బ్యాంకు లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవడమో లేదంటే కొనుక్కోవడమో చేస్తుంటారు. గృహ రుణం 10 నుంచి 30 సంవత్సరాల దీర్ఘకాలానికి తీసుకుంటారు. ఈ మధ్య కాలంలో వడ్డీ రేట్లు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం రుణ చెల్లింపులపై పడుతుంది. తగ్గడం చాలా అరుదు గాని రుణ వడ్డీ రేట్లు ఈ మధ్య కాలంలో పెరుగుతూనే ఉన్నాయి. ఇలా గృహ రుణాల వడ్డీ రేట్లు పెరిగినప్పుడల్లా బ్యాంకులు చెల్లించాల్సిన ఈఎంఐల కాలవ్యవధిని పెంచుతుంటాయి. అటువంటి సందర్భాల్లో బ్యాంకులు రుణగ్రహీతను సంప్రదించడం లేదు. కనీసం కస్టమర్లకు సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఇదిగో ఇప్పుడు వీటికి చెక్ పెట్టనుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

గృహ రుణాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్ల విధానం నుంచి ఫిక్స్‌డ్‌ వడ్డీ రేట్ల విధానంలోకి మారే అవకాశాన్ని తీసుకురావాలని నిర్ణయించింది ఆర్బీఐ. సాధారణంగా వడ్డీ రేట్ల పెరిగినప్పుడు రెగ్యులేటెడ్‌ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈఎంఐలో ఎలాంటి మార్పులూ చేయకుండా కాలవ్యవధిని సవరించే విధానంలో మార్పు తీసుకురానుంది. గృహ రుణ కాల వ్యవధి లేదా ఈఎంఐలో మార్పులు చేసేటప్పుడు సంబంధిత సమాచారాన్ని రుణ గ్రహీతలకు తెలియజేసేలా ఆర్బీఐ నిబంధనల్లో మార్పులు తెస్తోంది.

Also Read: రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో ఇళ్లకు భారీ డిమాండ్.. ఎందుకో తెలుసా!

అంతే కాకుండా ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్ల విధానం నుంచి ఫిక్స్‌డ్‌ వడ్డీ విధానానికి మారేందుకు అవకాశం ఇవ్వడంతో పాటు హోమ్‌ లోన్‌ ముందస్తు చెల్లింపులకు రుణ గ్రహీతకు అనుమతించాలని ఆర్బీఐ నిర్ణయించింది. గృహ రుణాల వడ్డీ రేట్లకు సంబందించిన కొత్త ఆప్షన్ల అమలుకు సంబంధించిన ఛార్జీల విషయంలో పారదర్శకంగా వ్యవహరించడంతో పాటు రుణ గ్రహీతకు ఆయా ఛార్జీల వివరాలను స్పష్టంగా తెలియజేయాలని బ్యాంకులను ఆదేశించింది. ఫిక్స్ డ్ వడ్డీ విధానానికి సంబందించి పూర్తి మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేయనుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

Also Read: హైదరాబాద్‌ బుద్వేల్‌ వెంచర్‌కు భారీ డిమాండ్.. అందుబాటు ధరల్లో గృహాలు!