RBI : నిబంధనలు ఉల్లంఘించిన ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్ లకు షాకిచ్చిన ఆర్బీఐ..

ప్రైవేట్ రంగ బ్యాంకులైన యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝుళిపించింది.

RBI : నిబంధనలు ఉల్లంఘించిన ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్ లకు షాకిచ్చిన ఆర్బీఐ..

RBI

YES Bank and ICICI Bank : ప్రైవేట్ రంగ బ్యాంకులైన యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝుళిపించింది. రెగ్యులేటరీ నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారించిన తరువాత రెండు బ్యాంకులకు భారీ జరిమానాలు విధించింది. ఈ రెండు బ్యాంకులు అనేక మార్గదర్శకాలను పాటించడం లేదని ఆర్బీఐ పేర్కొంది. దీని కారణంగా యెస్ బ్యాంక్ కు రూ. 91లక్షలు, ఐసీఐసీఐ బ్యాంకుకు రూ. కోటి జరిమానాను ఆర్బీఐ విధించింది.

UPI Payments in Banks : ఆర్బీఐ బిగ్ ప్లాన్.. త్వరలో యూపీఐ ద్వారా బ్యాంకుల్లో కూడా క్యాష్ డిపాజిట్ చేయొచ్చు!

ఆర్బీఐ ప్రకారం.. యెస్ బ్యాంక్ కస్టమర్ సర్వీస్, అంతర్గత, కార్యాలయ ఖాతాలకు సంబంధించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిందని తెలిపింది. సెంట్రల్ బ్యాంక్ ప్రకారం.. బ్యాంకింగ్ రెగ్యులేటర్ కొన్ని ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు ఛార్జీలు విధించినట్లు గుర్తించింది. దీనికితోడు పలు విధాలుగా ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించడంతో యోస్ బ్యాంక్ కు రూ. 91లక్షల జరిమానాను ఆర్బీఐ విధించింది.

అదేవిధంగా రుణాలు, అడ్వాన్సులు – చట్టబద్ధమైన, ఇతర నిబంధనలు పాటించనందుకు ఐసీఐసీఐ బ్యాంక్ పై ఆర్బీఐ రూ. కోటి జరిమానా విధించింది. బ్యాంక్ నిర్దిష్ట ప్రాజెక్టులకు బదులు ప్రత్యామ్నాయంగా కొన్ని సంస్థలకు టర్మ్ లోన్లను మంజూరు చేసిందని ఆర్బీఐ గుర్తించింది. దీనికితోడు పలు విభాగాల్లో నిబంధనలు ఉల్లంఘించినందుకు ఐసీఐసీఐ బ్యాంకుకు ఆర్బీఐ భారీ జరిమానాను విధించింది.