UPI Payments in Banks : ఆర్బీఐ బిగ్ ప్లాన్.. త్వరలో యూపీఐ ద్వారా బ్యాంకుల్లో కూడా క్యాష్ డిపాజిట్ చేయొచ్చు!

యూపీఐ యూజర్లకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకూ డెబిట్ కార్డులతోనే క్యాష్ డిపాజిట్ చేసే వీలుంది. ఇకపై యూపీఐ పేమెంట్స్ ద్వారా కూడా బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్ చేసే సౌకర్యం అందుబాటులోకి రానుంది.

UPI Payments in Banks : ఆర్బీఐ బిగ్ ప్లాన్.. త్వరలో యూపీఐ ద్వారా బ్యాంకుల్లో కూడా క్యాష్ డిపాజిట్ చేయొచ్చు!

RBI's Next Big Plan - Cash Deposit In Banks Via UPI. What It Means

UPI Payments in Banks : యూపీఐ వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారత రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో యూపీఐ ద్వారా బ్యాంకుల్లో కూడా క్యాష్ డిపాజిట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించనుంది. మొబైల్ ఫోన్ల ద్వారా ఇంటర్నల్ బ్యాంకు ట్రాన్సాక్షన్ల కోసం ‌ఇన్‌స్టంట్ రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ యూపీఐతో బ్యాంకుల్లో నగదు జమ చేసే సౌకర్యాన్ని సులభతరం చేస్తామని ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

Read Also : MobiKwik Pocket UPI : గుడ్ న్యూస్.. ఇక బ్యాంకు అకౌంటుతో పనిలేదు.. ‘పాకెట్ యూపీఐ’తో ఈజీ పేమెంట్స్..!

థర్డ్-పార్టీ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అప్లికేషన్‌ల ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPIs) లింక్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్ కూడా అనుమతించాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.. బ్యాంకుల ద్వారా అమలు చేసే ఏటీఎం మెషీన్‌లు (సీడీఎంలు)తో యూపీఐ క్యాష్ డిపాజిట్ సౌకర్యం కల్పించనున్నట్టు వెల్లడించారు. తద్వారా బ్యాంకు శాఖలపై నగదు నిర్వహణ భారాన్ని తగ్గించడంతోపాటు కస్టమర్ సౌలభ్యాన్ని పెంచుతాయని ఆయన పేర్కొన్నారు.

డెబిట్ కార్డులే కాదు.. యూపీఐ పేమెంట్స్ కూడా :
ప్రస్తుతానికి ఏటీఎం మిషన్లలో నగదు డిపాజిట్ సౌకర్యం అనేది డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, యూపీఐ పేమెంట్లకు ఫుల్ డిమాండ్ ఉన్న కారణంగా ఏటీఎంలలో కార్డ్ లెస్ క్యాష్ డిపాజిట్ ఫీచర్ ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. యూపీఐ ద్వారా సులభంగా ఏటీఎం సీడీఎం మిషన్లలో క్యాష్ డిపాజిట్ చేసేందుకు అవకాశం కల్పించనున్నట్టు గవర్నర్ దాస్ చెప్పారు. దీనికి సంబంధించి త్వరలోనే కార్యాచరణ ఆదేశాలు జారీ చేస్తామని ఆర్‌బీఐ తెలిపింది. ఆర్బీఐ వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడానికి థర్డ్-పార్టీ యూపీఐ అప్లికేషన్‌ల ద్వారా పీపీఐలను లింక్ చేయడానికి అనుమతించాలని కూడా ప్రతిపాదించింది.

పీపీఐ హోల్డర్ల కోసం యూపీఐ పేమెంట్స్ :
ప్రస్తుతం, బ్యాంక్ అకౌంట్ల నుంచి యూపీఐ చెల్లింపులు, బ్యాంక్ యూపీఐ యాప్ ద్వారా బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడం ద్వారా లేదా ఏదైనా థర్డ్ పార్టీ యూపీఐ అప్లికేషన్‌ని ఉపయోగించడం ద్వారా లావాదేవీలను చేయవచ్చు. అయితే, అదే సదుపాయం పీపీఐలకు మాత్రం అందుబాటులో లేదు. పీపీఐ జారీచేసేవారు అందించిన అప్లికేషన్‌ను ఉపయోగించడం ద్వారా మాత్రమే ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు చేయడానికి పీపీఐలను ఉపయోగించవచ్చు.

పీపీఐ హోల్డర్‌లకు మరింత సౌలభ్యాన్ని అందించేలా ఇప్పుడు థర్డ్-పార్టీ యూపీఐ యాప్స్ ద్వారా పీపీఐలను లింక్ చేయడానికి అనుమతించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. పీపీఐ హోల్డర్‌లు బ్యాంక్ ఖాతాదారుల మాదిరిగానే యూపీఐ పేమెంట్లను చేసేందుకు వీలు కల్పిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా త్వరలో వెలువడనున్నాయి.

Read Also : Whatsapp UPI Payments : యూపీఐ పేమెంట్ స్కాన్ : త్వరలో వాట్సాప్ చాట్స్ నుంచే నేరుగా యూపీఐ పేమెంట్లు!