Realme Narzo 70 Pro 5G : ఈ రియల్‌మి 5జీపై స్పెషల్ డిస్కౌంట్.. ధర రూ 16,999 మాత్రమే.. టచ్ చేయకుండానే ఫోన్ కంట్రోల్ చేయొచ్చు!

Realme Narzo 70 Pro 5G : ఈ రియల్‌మి 5జీ ఫోన్ గత మార్చి 19న లాంచ్ కాగా, ప్రస్తుతం స్పెషల్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ నార్జో 70ప్రో 5జీ ఫోన్ రూ. 16,999కి సొంతం చేసుకోవచ్చు.

Realme Narzo 70 Pro 5G : ఈ రియల్‌మి 5జీపై స్పెషల్ డిస్కౌంట్.. ధర రూ 16,999 మాత్రమే.. టచ్ చేయకుండానే ఫోన్ కంట్రోల్ చేయొచ్చు!

Realme Narzo 70 Pro 5G available ( Image Credit : Google )

Realme Narzo 70 Pro 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌‌ఫోన్ దిగ్గజం రియల్‌మి ఈ ఏడాది మార్చిలో నార్జో 70ప్రో 5జీ ఫోన్ లాంచ్ చేసింది. మీ బడ్జెట్‌లో కొన్ని అద్భుతమైన స్పెసిఫికేషన్‌లను అందిస్తుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 6.67-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ నార్జో 5జీ ఫోన్ కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న యూజర్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ 5జీ ఫోన్ గత మార్చి 19న లాంచ్ కాగా మార్చి 22న విక్రయానికి అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇప్పుడు, రియల్‌మి ఫోన్‌పై స్పెషల్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ నార్జో 70ప్రో 5జీ ఫోన్ రూ. 16,999కి సొంతం చేసుకోవచ్చు.

Read Also : MG Gloster Editions : కొంటే ఇలాంటి కారు కొనాలి.. ఎంజీ గ్లోస్టర్ రెండు కొత్త వేరియంట్లు ఇవే.. ధర ఎంతంటే?

రియల్‌మి నార్జో 70ప్రో 5జీపై డిస్కౌంట్ :
ఈరోజు మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రారంభమైన రియల్‌మి సేవింగ్స్ డే సేల్‌లో భాగంగా రియల్‌మి ఫోన్ (realme.com), అమెజాన్ వెబ్‌సైట్‌లో తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఆసక్తి గల కొనుగోలుదారులు ఈ 5జీ ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్‌పై రూ. 3వేలు, 8జీబీ+256జీబీ వేరియంట్‌పై రూ.2వేలు తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ మాత్రమే గమనించాలి. అంటే.. ఈ అర్ధరాత్రి వరకు మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

రియల్‌మి నార్జో 70ప్రో 5జీ టాప్ స్పెషిఫికేషన్లు :
స్లిమ్ బెజెల్స్, హోల్-పంచ్ డిస్‌ప్లే, ఫ్లాట్-స్క్రీన్ డిజైన్‌తో రియల్‌మి నార్జో 70 ప్రో ఫోన్ బ్యాక్ సైడ్ హారిజన్ గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంది. 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, ఎఫ్‌హెచ్‌డీ+ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 7050 5జీ చిప్‌సెట్ ద్వారా ఆధారితమైన ఈ ఫోన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, మాలి-జీ68 జీపీయూ గేమింగ్, మల్టీమీడియా ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

కెమెరా ఫ్రంట్ సైడ్.. ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 2ఎక్స్ ఇన్-సెన్సార్ జూమ్‌తో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్890 ప్రైమరీ సెన్సార్‌తో పాటు సెల్ఫీలు, వీడియోలకు 16ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం ఫోన్‌లో మాస్టర్‌షాట్ అల్గోరిథం కూడా ఉంది. 5000ఎంఎహెచ్ బ్యాటరీ, 67డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జ్‌తో రియల్‌మి నార్జో 70ప్రో లైఫ్ లాంగ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

టచ్‌లెస్ కోసం ఎయిర్ గెచర్ కంట్రోల్ భారీ వినియోగం సమయంలో హీట్ వెదజల్లడానికి 3డీ వీసీ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది. రియల్‌మి నార్జో 70ప్రో ఎయిర్ గెస్చర్ కంట్రోల్స్ కూడా కలిగి ఉంది. వినియోగదారులు ఈ ఫోన్ టచ్ చేయకుండానే ఫోన్‌తో ఇంటరాక్ట్ అయ్యేలా చేస్తుంది. అదనంగా, ఇది 3డీ వీసీ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ అధిక వినియోగంలోకూడా వేడెక్కదు.

Read Also : Forgot IRCTC Password : మీ ఐఆర్‌సీటీసీ పాస్‌వర్డ్ మర్చిపోయారా? మీ అకౌంట్ పాస్‌వర్డ్‌ ఆన్‌లైన్‌లో ఎలా రీసెట్ చేయాలో తెలుసా?