ఫ్లాష్ సేల్ : Redmi Note 8 ఫోన్లపై డిస్కౌంట్లు, ఆఫర్లు 

  • Published By: sreehari ,Published On : November 26, 2019 / 07:25 AM IST
ఫ్లాష్ సేల్ : Redmi Note 8 ఫోన్లపై డిస్కౌంట్లు, ఆఫర్లు 

Updated On : November 26, 2019 / 7:25 AM IST

ప్రముఖ చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ కంపెనీ సబ్ బ్రాండ్ రెడ్ మి స్మార్ట్ ఫోన్లపై ఫ్లాష్ సేల్ మొదలైంది. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌లో వీక్లీ సేల్స్ లో భాగంగా మంగళవారం (నవంబర్ 26, 2019) మధ్యాహ్నం 12గంటల నుంచి Redmi Note 8 మోడల్ ఫోన్లపై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఇండియాలో లాంచ్ అయిన కొద్దికాలంలోనే ఈ స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఎంతో చేరువైంది.

ఆ తర్వాత రెడ్ మి నోట్ 8 ప్రో కూడా మార్కెట్లో రిలీజ్ అయింది. క్వాడ్ రియర్ కెమెరా సెటప్ తో పాటు 48మెగాఫిక్సల్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 665 SoC ప్రాసెసర్ కూడా దీనికో స్పెషల్ ఎట్రాక్షన్ గా చెప్పుకోవచ్చు. స్టోరేజీల విషయానికి వస్తే 8GB ర్యామ్, 4GB ర్యామ్ యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక రెడ్ మి నోట్ 8 ప్రో సేల్ అమెజాన్, ఎంఐ వెబ్ సైట్లో ధర ఎంత ఉంది, ఆఫర్లు ఏంటో ఓసారి చూద్దాం. 

ధరలు :
* రెడ్ మి నోట్ 8 (4GB ర్యామ్ + 64GB స్టోరేజీ) ఫోన్ ప్రారంభ ధర రూ.9వేల 999 
* మరో వేరియంట్ (6GB ర్యామ్ + 128GB స్టోరేజీ) ప్రారంభ ధర రూ.12వేల 999 
 
సేల్స్ ఆఫర్లు – డిస్కౌంట్లు :
* Mi.comలో ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ (యాక్సస్ బ్యాంకు, HDFC, HSBC కార్డులపై)
* కొనుగోలుదారులు Redmi note 8 pro ఫోన్ కొంటే.. Airtel డేటా ఆఫర్ (mi.com) పొందవచ్చు.

ఫీచర్లు – స్పెషిఫికేషన్లు ఇవే :
* 6.39 అంగుళాల ఫుల్ HD+ (1080×2280) ఫిక్సల్స్ డిస్ ప్లే
* క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 665 SoC
* 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ఎక్స్ ఫ్యాండబుల్ (512GB)
* 48MP + 8MP + డ్యుయల్ 2MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్
* 13MP సెల్ఫీ కెమెరాలు
* 4,000mAh బ్యాటరీ