Petrol Pump : బంకులో పెట్రోల్ కొట్టిస్తున్నారా? బీకేర్ ఫుల్.. తప్పకుండా చెక్ చేయాల్సిన విషయాలు

Refueling Your Car : పెట్రోల్ బంకుకి వెళ్లిన సమయంలో ప్రతి వాహనదారుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. తప్పకుండా కొన్ని విషయాలు చెక్ చేసుకోవాల్సిందే. లేదంటే మోసపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.

Petrol Pump : బంకులో పెట్రోల్ కొట్టిస్తున్నారా? బీకేర్ ఫుల్.. తప్పకుండా చెక్ చేయాల్సిన విషయాలు

Refueling Your Car At Petrol Pump (Photo : Google)

ఇది మోసాల కాలం. ఎక్కడ చూసినా చీటింగే. రెప్పపాటులో అడ్డంగా దోచేస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. ప్రతీ విషయంలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతా సజావుగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ కంటికి కనిపించని మోసాలతో దగా చేస్తేస్తారు. విషయానికి వస్తే.. వాహనంలో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంకుకి వెళ్తాం. డబ్బులు ఇచ్చి ఫ్యూయల్ కొట్టించుకుంటాం. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాం. ఇది చాలా కామన్.

అయితే, ఇక ముందు అలా కుదరదు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే అడ్డంగా మోసపోవడం ఖాయం. వాహనంలో ఇంధనం పోయించుకోవడానికి పెట్రోల్ బంకుకి వెళ్లిన సమయంలో ప్రతి వాహనదారుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. తప్పకుండా కొన్ని విషయాలు చెక్ చేసుకోవాల్సిందే. లేదంటే మోసపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇంతకీ, ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం..

Petrol Pump (Photo : Google)

 

పెట్రోల్ బంకుల్లో మోసాలు జరగడానికి ఆస్కారం ఉంది. పెట్రోల్ పంపు రిగ్గింగ్ చేసినప్పుడు చీట్ చేయడం చాలా తేలిక. అందుకే, రీడింగ్ మెషీన్ ను కచ్చితంగా చెక్ చేసుకోవాలి. జీరో ఉందో లేదో నిర్ధారించుకోవాలి. ఆ తర్వాతే ఇంధనం పోయించుకోవాలి.

Also Read : బరువు తగ్గించటంలో సహాయపడే 7 పానీయాలు ఇవే !

పెట్రోల్ బంకులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
నిజానికి మనం ఇంత ఫ్యూయల్ కావాలని చెబుతాం. పెట్రోల్ బంకు సిబ్బంది సరే అంటారు. కానీ, మనం చెల్లించిన డబ్బు కన్నా తక్కువ లీటర్ల ఇంధనం కొట్టి మోసం చేస్తుంటారు. అందుకే ఆ సమయంలో అలర్ట్ గా ఉండాలి. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల విభాగం ఎక్స్ లో ఓ పోస్టు ద్వారా తెలిపింది. వాహనదారులు పెట్రోల్ బంకుల్లో మోసాలపై అప్రమత్తంగా ఉండాలని లేకుంటే మోసపోతారని హెచ్చరించింది. పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాల పట్ల వాహనదారుల్లో చైతన్యం కల్పించే ప్రయత్నం చేసింది. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుపుతూ ఎక్స్ లో పోస్టు పెట్టింది.

Petrol Pump (Google)

బంకులో పెట్రోల్ లేదా డీజిల్‌ను కొట్టించుకునే ముందు ఈ పాయింట్లను గుర్తుంచుకోండి..
* మీటర్ రీడింగ్ 0.00 ఉండాలి.
* డిస్పెన్సింగ్ మెషీన్ ధృవీకరణ సర్టిఫికెట్ కనిపించాలి.
* ఎంత ఇంధనం కొట్టారో ధృవీకరించుకోవాలని వాహనదారుడు కోరుకుంటే పెట్రోల్ బంకులో 5 లీటర్ స్కేల్‌ని ఉపయోగించుకోవచ్చు.
* వాహనదారులకు ఏమైనా సందేహాలు ఉంటే నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ నెంబర్ 1915 కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
* లేదా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ ద్వారా కూడా కంప్లైంట్ ఇవ్వొచ్చు.
* పెట్రోల్ సాంద్రతలో (డెన్సిటీ) ఏదైనా వ్యత్యాసం ఉంటే వెంటనే ప్రశ్నించాలి.

* పెట్రోల్, డీజిల్ డెన్సిటీ(ఇంధనం యొక్క నాణ్యత) చెక్ చేయాలి.
* పెట్రోల్ కి ఉండాల్సిన డెన్సిటీ(710/770 kg/m3)
* డీజిల్ కి ఉండాల్సిన డెన్సిటీ(820/860 kg/m3)
* ఈ రీడింగ్ కు ఎక్కువ ఉన్నా లేదా తక్కువ ఉన్నా ఫ్యూయల్ క్వాలిటీ బాగోలేనట్లే.
* చాలా బంకుల్లో డెన్సిటీ వాల్యూ పెట్రోల్, డీజిల్ రెండింటికీ ఒకేలా ఉంటుంది. అది కరెక్ట్ కాదు.
* ఒకవేళ ఏదైనా బంకులో ఈ రీడింగ్ కనిపించకపోతే పెట్రోలో కొట్టించుకోవద్దు.

* డెన్సిటీలో తేడాలో ఉంటే వాహనం మైలేజీ తగ్గుతుంది.
* వాహనం త్వరగా పాడైపోయే ప్రమాదం ఎక్కువ.
* బోర్డులో జీరో ఇండికేషన్ చూసుకోవాలి.
* అవసరమైతే వాహనం దిగి తనిఖీ చేసుకోవడం మరీ మంచిది.

Also Read : ప్రతి రోజు నిమ్మకాయ నీరు తాగుతున్నారా?… అయితే మీరు డేంజర్ లో పడ్డట్టే !