అమ్మకానికి రోడ్డు : డీల్ విలువ రూ. 3వేల కోట్లు

  • Published By: madhu ,Published On : March 15, 2019 / 03:45 AM IST
అమ్మకానికి రోడ్డు : డీల్ విలువ రూ. 3వేల కోట్లు

అవును నిజం. రోడ్డు అమ్మకానికి పెట్టిందో ఓ ప్రముఖ కంపెనీ. అప్పుల్లో ఆ కంపెనీ ఉండడంతో దానికి సంబంధించిన ఆస్తులను అమ్మేస్తూ వస్తోంది. బిజినెస్ రంగంలో ఒకప్పుడు వెలుగులు వెలిగిన ‘అనీల్ అంబానీ’ గ్రూపునకు చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఆర్ఇన్‌ఫ్రా). రుణభారం తగ్గించుకొనే పనిలో పడింది ఆ సంస్థ.

ఎందుకంటే భారీగా అప్పులు చేసింది. ఆ అప్పులు చెల్లించాల్సి ఉండడంతో పలు చర్యలు తీసుకొంటోంది ఆ కంపెనీ. ఇందులో భాగంగా ఢిల్లీ – ఆగ్రా టోల్ రోడ్ వేను సింగపూర్‌కి చెందిన క్యూబా హైవేస్‌కు విక్రయించనున్నట్లు మార్చి 14వ తేదీ గురువారం వెల్లడించింది. 
Read Also: ముంబైలో కసబ్ బ్రిడ్జి : ఆ పేరు ఎలా వచ్చింది

క్యూబ్ హైవేస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు, ఈ డీల్ విలువ రూ. 3,600 కోట్లుగా ఉండనున్నట్లు తెలిపింది. డీల్ ఒకవేళ ఒకే అయితే…ఆర్ఇన్‌ఫ్రా రుణ భారం 25 శాతం తగ్గి రూ. 5వేల కోట్ల లోపు స్థాయికి దిగి వస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. రెండో నంబర్ జాతీయ రహదారిపై ఢిల్లీ – ఆగ్రాలను కలుపుతూ 180 కిలో మీటర్ల దూరం..6లైన్ల రోడ్‌ను రిలయెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి చెందిన స్పెషల్ పర్సస్ వెహికల్  డీఏ టోల్ రోడ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది.

అత్యంత రద్దీగా ఉండే ఈ రహదారిపై 2012లో టోల్ విధానం ప్రారంభమైంది. 2038 దాక కొనసాగుతుంది. ప్రధానేత వ్యాపారాలను విక్రయించి కీలకమైన ఇంజినీరింగ్, నిర్మాణ వ్యాపార విభాగాలపై మరింతగా దృష్టి పెట్టాలని కంపెనీ యోచిస్తోంది.