Reliance Jio Offer : రిలయన్స్ జియో కొత్త ఆఫర్.. ఏడాది వరకు ఫ్రీగా జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్‌ పొందవచ్చు!

Reliance Jio Offer : జియోఎయిర్ ఫైబర్ లేదా జియోఫైబర్ కనెక్షన్‌ పొందే కొత్త కస్టమర్‌లు ఏదైనా రిలయన్స్ డిజటల్ లేదా మైజియో స్టోర్‌ నుంచి ఈ ఆఫర్‌ను పొందవచ్చు.

Reliance Jio Offer : రిలయన్స్ జియో కొత్త ఆఫర్.. ఏడాది వరకు ఫ్రీగా జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్‌ పొందవచ్చు!

Reliance Jio is offering 1-year free Jio AirFiber connection

Updated On : September 17, 2024 / 10:23 PM IST

Reliance Jio Offer : ప్రముఖ రిలయన్స్ జియో దీపావళికి ముందు కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ‘దీపావళి ధమాకా’ ప్రమోషన్ కింద యూజర్లకు ఒక ఏడాది ఫ్రీగా జియోఎయిర్‌ఫైబర్ కనెక్షన్‌ను క్లెయిమ్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. కొత్త, ఇప్పటికే ఉన్న జియోఫైబర్, జియోఎయిర్‌ఫైబర్ యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ ఆఫర్‌ను రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లలో షాపింగ్ చేయడం ద్వారా లేదా ప్రత్యేక దీపావళి ప్లాన్‌ ఎంచుకోవడం ద్వారా పొందవచ్చు.

Read Also : HMD Skyline Launch : కొత్త హెచ్ఎండీ స్కైలైన్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసిందోచ్.. యూజర్లు ఇంట్లోనే స్వయంగా రిపేర్ చేసుకోవచ్చు..!

జియోఎయిర్ ఫైబర్ లేదా జియోఫైబర్ కనెక్షన్‌ని పొందాలని చూసే.. కొత్త కస్టమర్‌లు ఏదైనా రిలయన్స్ డిజటల్ లేదా మైజియో స్టోర్‌లో రూ. 20వేలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేయడం ద్వారా ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేయవచ్చు. అర్హతకు ధర చాలా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే, ఇప్పటికే ఏసీ, ఫ్రిజ్, టీవీ లేదా ఫోన్ వంటి ప్రొడక్టులను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి ఈ ఆఫర్ ద్వారా మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.

అదనంగా, ఇప్పటికే ఉన్న జియోఎయిర్‌ఫైబర్ వినియోగదారులు రూ. 2,222 ధరతో 3-నెలల దీపావళి ప్లాన్‌తో రీఛార్జ్ చేయడం ద్వారా కూడా ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. దీని వల్ల ఒక ఏడాది ఫ్రీ సర్వీసును పొందవచ్చు. ఇప్పటికే ఉన్న జియోఫైబర్ యూజర్లు కూడా అదే ప్లాన్‌ను వన్-టైమ్ అడ్వాన్స్ రీఛార్జ్ చేయడం ద్వారా ఆఫర్ బెనిఫిట్స్ పొందవచ్చు. రిలయన్స్ జియో ప్రకారం.. అర్హత కలిగిన కస్టమర్‌లు నవంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు ఏడాది పొడవునా 12 కూపన్‌లను అందుకుంటారు.

ఈ కూపన్లలో యూజర్ యాక్టివ్ జియోఎయిర్ ఫైబర్ ప్లాన్ విలువకు సమానంగా ఉంటాయి. ఏదైనా రిలయన్స్ డిజిటల్ వద్ద రీడీమ్ చేసుకోవచ్చు. మైజియో, జియోపాయింట్ లేదా జియోమార్ట్ డిజిటల్ ప్రత్యేక స్టోర్. కానీ, కూపన్‌ను ఉపయోగించడానికి వినియోగదారులు ప్రతి కూపన్‌ను స్వీకరించిన 30 రోజులలోపు ఎలక్ట్రానిక్స్‌పై రూ. 15వేలు లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలు చేయాలి. దీపావళి ధమాకా ఆఫర్ సెప్టెంబర్ 18, 2024 నుంచి నవంబర్ 3, 2024 వరకు అందుబాటులో ఉంటుంది.

Read Also : Airtel Digital TV Plans : ఎయిర్‌టెల్ కొత్త డిజిటల్ టీవీ ప్లాన్లు.. అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్ కూడా..!