జియో AI వీడియో కాల్ అసిస్టెంట్ వచ్చేసింది

టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త సర్వీసు ప్రవేశపెట్టింది. అదే.. AI వీడియో కాల్ అసిస్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో కాల్ అసిస్టెంట్ సర్వీసును అందుబాటులో తీసుకొచ్చింది. ఈ సర్వీసును 4G ఫోన్ కాల్ ద్వారా యాక్సస్ చేసుకోవాలంటే ఎలాంటి అప్లికేషన్ ఇన్ స్టాల్ చేయాల్సిన అవసరం లేదు.
కస్టమర్లతో కమ్యూనికేట్ అయ్యేందుకు వీలుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సబ్సిడరీ, యూఎస్ ఆధారిత రాడీసిస్ రిలయన్స్ జియో సంయుక్తంగా ఈ వీడియో అసిస్టెంట్ సర్వీసును రూపొందించినట్టు ఒక ప్రకటన తెలిపింది. ఈ వీడియో బాట్.. వివిధ కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు వీలుగా మార్పులు చేసుకోవచ్చు. ఈ ప్లాట్ ఫాంపై అదనంగా ఆటో లెర్నింగ్ ఫీచర్ ద్వారా కస్టమర్లకు కచ్చితమైన సమాధానాలను మెరుగుపరిచేందుకు దోహదపడుతుంది.
జియో బాట్ ప్లాట్ ఫాంతో పనిచేసే జియో బాట్ మేకర్ టూల్ సాయంతో చిన్న వ్యాపారాల్లో కూడా ఎలాంటి కోడింగ్ అవసరం లేకుండానే సొంతంగా AI ఆధారిత బాట్ క్రియేట్ చేసుకునేలా చేయడమే కంపెనీ లక్ష్యమని పేర్కొంది. కస్టమర్లు ఎంపిక చేసుకున్న భాష ఆధారంగా సపోర్ట్ అందించేలా ఏఐ వీడియో బాట్ రాబోతోందని ప్రకటన తెలిపింది.