Retail tomato prices: నవంబరులో 22.4 శాతం తగ్గిన రిటైల్ టామాటా ధరలు

టమాటాల ఆలిండియా ఏవరేజ్‌ రిటైల్ ధర నవంబర్ 14న కిలోకి రూ.52.35గా ఉంది.

Retail tomato prices: నవంబరులో 22.4 శాతం తగ్గిన రిటైల్ టామాటా ధరలు

Tomato Price

Updated On : November 17, 2024 / 8:35 PM IST

నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని బాధపడుతున్న సామాన్యుడికి ఈ నెల కాస్త ఉపశమనం కలిగింది. దేశ వ్యాప్తంగా టమాటా సరఫరా పెరగడంతో రిటైల్ టమాటా ధరలు నెలవారీగా చూసుకుంటే 22.4 శాతం తగ్గాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.

టమాటాల ఆలిండియా ఏవరేజ్‌ రిటైల్ ధర నవంబర్ 14న కిలోకి రూ.52.35గా ఉంది. ఈ ఏడాది అక్టోబరు 14న కిలో టమాటా ఆలిండియా ఏవరేజ్‌ రిటైల్ ధర రూ.67.50గా ఉంది. ఆ సమయంలో ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిలో మోడల్ హోల్‌సేల్ ధరలు దాదాపు 50 శాతం తగ్గాయి క్వింటాల్‌కు రూ.5,883 నుంచి రూ. 2,969కి ధరలు పడిపోయాయి.

సరఫరా పెరగడంతో ధరలు తగ్గాయి. మహారాష్ట్రలోని పింపాల్‌గావ్ , ఏపీలోని మదనపల్లె, కర్ణాటకలోని కోలార్ వంటి కీలక మార్కెట్‌లలో కూడా ధరలు ఇదే విధంగా కొనసాగాయని వినియోగదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది.

మదనపల్లె, కోలార్‌లోని ప్రధాన టమాటా కేంద్రాలకు వాటి సరఫరా తగ్గినప్పటికీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ నుంచి సీజనల్ సరఫరాలు బాగానే ఉండడంతో దేశ వ్యాప్తంగా సరఫరా గ్యాప్‌ రాలేదని, దీంతో ఈ నెల ధరలు తగ్గాయని పేర్కొంది.

Zomato ‘District’ App : జొమాటో కొత్త యాప్ ‘డిస్ట్రిక్’ ఇదిగో.. డైనింగ్, లైవ్ ఈవెంట్స్ సర్వీసులు!