మండే కాలం : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

మళ్లీ పెట్రో మంట మండుతోంది. ఎండాకాలం టెంపరేచర్లతో పోటీ పడి ధరలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 21వ తేదీ గురువారం ఒక్క రోజే లీటర్ పెట్రోల్ పై 15, డీజిల్ పై 16 పైసలు పెరగటం విశేషం. కొన్నాళ్లుగా తగ్గుతూ వస్తున్న ధరలు.. మళ్లీ ఒక్కసారిగా భయపెడుతున్నాయి. అన్నింటికీ అంతర్జాతీయ మార్కెట్, రూపాయి విలువను సాకు చూపిస్తూ వస్తున్న ప్రభుత్వాలకు ఇది మింగుడు పడని అంశం. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో భారీ ఎత్తున ఉపశమనం కలిగించిన ధరలు.. ఇప్పుడు మళ్లీ వినియోగదారులను వణుకుపుట్టిస్తున్నాయి.
ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 71.15, డీజిల్ రూ.66.33గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ. 76.79 ఉండగా డీజిల్ ధర రూ.69.47 ఉంది. చెన్నైలో పెట్రోలు ధర రూ. 73.87, డీజిల్ ధర రూ.70. 09 గా ఉంది. కోలకతాలో పెట్రోలు ధర రూ. 73.25, డీజిల్ ధర రూ.68.12 నమోదైంది. హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 75.50, డీజిల్ ధర రూ.71.12గా ఉంది. అమరావతిలో పెట్రోలు ధర రూ. 75.28, డీజిల్ రూ.71.49గా ఉంది.
ఇప్పటికే మార్కెట్ లో నిత్యవసరాల ధరలు మండిపోతున్నాయి. పెరిగిన ధరలతో ప్రజలు సతమతవుతున్నారు. ఈ తరుణంలో ’మూలిగే నక్కపై తాటి పండు పడ్డ’ చందంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగడంతో ప్రజలపై మరింత భారం పడనుంది. చమురు ధరల పెంపు సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుత పెరుగుదలతో దేశంలోని వివిధ మెట్రో నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
మెట్రో నగరాలు..పెట్రోల్, డీజిల్ ధరలు
ఢిల్లీ : లీటరు పెట్రోలు ధర రూ. 71.15, లీటరు డీజిల్ ధర రూ.66.33
ముంబై : లీటరు పెట్రోలు ధర రూ.76.79, లీటరు డీజిల్ ధర రూ.69.47
చెన్నై : లీటరు పెట్రోలు ధర రూ. 73.87, లీటరు డీజిల్ ధర రూ.70.09
కోలకతా : లీటరు పెట్రోలు ధర రూ. 73.25, లీటరు డీజిల్ ధర రూ.68.12
హైదరాబాద్ : లీటరు పెట్రోలు ధర రూ. 75.50, లీటరు డీజిల్ ధర రూ.71.12
అమరావతి : లీటరు పెట్రోలు ధర రూ. 75.28, లీటరు డీజిల్ ధర రూ.71.49