Share Market : స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డు : ఫస్ట్ టైం 76వేల మార్క్ అధిగమించిన సెన్సెక్స్.. 23,100 దాటిన నిఫ్టీ..!

Share Market : బీఎస్ఈ సెన్సెక్స్ మొదటిసారిగా 500 పాయింట్లకు పైగా పెరిగి 76వేల మార్క్‌తో సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ50 కూడా 23,100 స్థాయిలను అధిగమించి కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది.

Share Market : స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డు : ఫస్ట్ టైం 76వేల మార్క్ అధిగమించిన సెన్సెక్స్.. 23,100 దాటిన నిఫ్టీ..!

Sensex Hits 76k For The First Time; Nifty Crosses 23,100: Midday Market Update ( Image Credit : Google )

Midday Share Market Update : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఈ వారం అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల మధ్య భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు బీఎస్‌ఇ (BSE) సెన్సెక్స్, నిఫ్టీ 50 మరోసారి జీవితకాల గరిష్ఠ స్థాయిని తాకాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికి కేవలం ఒక వారం ముందు సోమవారం (మే 27) ప్రారంభ ట్రేడింగ్ గంటలలో బీఎస్ఈ సెన్సెక్స్ మొదటిసారిగా 76వేల మార్క్‌ను అధిగమించి 76,009.68 వద్ద సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పెరిగింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ50 కూడా 23,100 స్థాయిలను అధిగమించి 23,110.8 వద్ద కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఐటీ షేర్లు జోరందుకోవడంతో ఈరోజు భారత స్టాక్‌ మార్కెట్‌లో ర్యాలీకి మద్దతు లభించింది.

ఈరోజు మధ్యాహ్నానికి (2.36 గంటల సమయంలో) నిఫ్టీ, సెన్సెక్స్ తాజా గరిష్టాలను తాకాయి. బ్యాంకింగ్, ఐటీ స్టాక్‌లు లాభాల్లో ముందంజలో ఉన్నాయి. నిఫ్టీ 50కి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ సహకారాన్ని అందించాయి. నిఫ్టీ 50లో దివీస్ ల్యాబ్ స్టాక్ అత్యధికంగా 4 శాతం లాభపడింది. ఎఫ్‌వై24 జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ ఊహించిన దానికంటే మెరుగైన లాభాలను పొందింది. బీఎస్ఈ సెన్సెక్స్ 345.84 లేదా 0.46 శాతం పెరిగి 75,756.23 వద్ద, నిఫ్టీ50 82.80 పాయింట్లు లేదా 0.36 శాతం పెరిగి 23,039.30 వద్ద ట్రేడవుతున్నాయి. సోమవారం దలాల్ స్ట్రీట్‌లో ర్యాలీకి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ స్టాక్‌లు బలమైన లాభాలను అందించాయి.

లోక్‌సభ ఎన్నికల 2024 ఫలితాలపై ఆశావాదం :
సార్వత్రిక ఎన్నికల 2024 ఫలితాల కన్నా ముందు పెట్టుబడిదారుల విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వచ్చే జూన్ 4న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందని మార్కెట్ అంచనా వేస్తోంది. భారతీయ స్టాక్ మార్కెట్‌లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తోంది. అనుకున్నట్టుగా పరిస్థితి అనుకూలంగా ఉంటే.. ఇదే పరిస్థితి కొనసాగుతుందని, పెట్టుబడుల ఉపసంహరణ, ల్యాండ్ బిల్లు, యూనిఫాం సివిల్ కోడ్‌తో సహా మరిన్ని సంస్కరణలకు అవకాశం ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు విశ్వసిస్తున్నారు.

ఎఫ్‌ఐఐ అమ్మకాలలో భారీ క్షీణత :
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (FII) అమ్మకాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత గురువారం నుంచి పెద్ద ఎత్తున కొనుగోలుదారులుగా మారారు. ఈ నెలలో ఇప్పటివరకు ఎఫ్‌ఐఐలు రూ. 22,046 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీని విక్రయించడంతో భారత మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది.

ఫెడ్ రేటు తగ్గింపు అంచనాలు :
ఈ ఏడాదిలో ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు అంచనాలతో అధికంగా ఆసియా షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. ఈ వారం అమెరికా ద్రవ్యోల్బణం డేటా ధరల ఒత్తిడిని తగ్గించడాన్ని సూచిస్తుంది. ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఈ ఏడాది వడ్డీ రేట్లను తగ్గిస్తారని పెట్టుబడిదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

52 వారాల గరిష్ట స్థాయి తాకిన సెన్సెక్స్‌ :
స్టాక్ మార్కెట్లో 215 స్టాక్‌లు 52 వారాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్, ఏజిస్ లాజిస్టిక్స్, అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్, అశోక్ లేలాండ్, బీఈఎల్, భారత్ ఫోర్జ్, ఎయిర్‌టెల్, బాష్, కొచ్చిన్ షిప్‌యార్డ్, దివీస్ ల్యాబ్స్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వంటి బీఎస్ఈ 500 స్టాక్‌లు తమ వాటాను తాకాయి.

Read Also : WhatsApp Voice Note : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై లాంగ్ వాయిస్ నోట్స్‌ను స్టేటస్ అప్‌డేట్‌లుగా షేర్ చేయొచ్చు!