SHARE Market : స్టాక్ మార్కెట్ లో బుల్ పరుగులు.. ఆల్ టైం హై లో సెన్సెక్, నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో దూసుకుపోతున్నాయి. వరుసగా రెండో వారంలోనూ ఇన్వెస్టర్లు లాభాలు పొందుతున్నారు.

SHARE Market : స్టాక్ మార్కెట్ లో బుల్ పరుగులు.. ఆల్ టైం హై లో సెన్సెక్, నిఫ్టీ

Market

Updated On : August 17, 2021 / 4:58 PM IST

SHARE Market స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో దూసుకుపోతున్నాయి. వరుసగా రెండో వారంలోనూ ఇన్వెస్టర్లు లాభాలు పొందుతున్నారు. సెన్సెక్స్‌, నిఫ్టీలు ఒడిదుడులకు తట్టుకుంటూ కొత్త ఎత్తులను చేరుతున్నాయి. మంగళవారం కూడా మార్కెట్లలో రికార్డుల పరంపర కొనసాగింది.

మంగళవారం బీఎస్ఈ- సెన్సెక్స్ 210 పాయింట్లు పుంజుకుని.. 55,792 వద్దకి చేరింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో సరి కొత్త రికార్డు స్థాయి అయిన 16,614 వద్ద ముగిసింది. బీఎస్ఈ- సెన్సెక్స్‌ ఇవాళ ఒక దశలో రికార్డు స్థాయిలో పాయింట్లు లాభపడి 55,854 పాయింట్లను టచ్‌ చేసి రికార్డు సృష్టించింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఈ రోజు ఉదయం 55,565 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే పాయింట్లు కోల్పోతూ 55,386 పాయింట్లను తాకింది. ఇక మార్కెట్‌లో కరెక‌్షన్‌ మొదలైందని అనుకునేలోగా ఒక్కసారిగా పుంజుకుంది. మార్కెట్‌ ముగిసే సమయానికి 209 పాయింట్లు లాభపడి 55,792 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. టెక్ మహీంద్రా, నెస్లే, హెచ్​యూఎల్​, టైటాన్​, టీసీఎస్​ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి. ఇండస్​ఇండ్​ బ్యాంక్, ఎన్​టీపీసీ, భారతీ ఎయిర్​టెల్, టాటా స్టీల్​, ఎల్​&టీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

అయితే ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు- షాంఘై (చైనా), నిక్కీ (జపాన్​), కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్​సెంగ్ (హాంకాంగ్​) నష్టాల్లో ఉన్నా.. దేశీయ సూచీలు మాత్రం వరుస లాభాలతో దూసుకుపోతుండటం విశేషం. అప్ఘాన్​ సంక్షోభం నేపథ్యంలో మదుపరులు కాస్త ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా సూచీలు ఒడుదొడుకులకు లోనయ్యాయి. అయితే ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు సానుకూలంగా స్పందించడం వల్ల ఒడుదొడుకుల నుంచి తేరుకోగలిగాయి.