Coiveshield Vaccine : బహిరంగ మార్కెట్లో కోవిషీల్డ్ అమ్మకాల కోసం సీరం దరఖాస్తు
కోవిషీల్డ్ టీకాను భారత మార్కెట్ లో రెగ్యులర్ గా అమ్ముకునేందుకు అనుమతులు ఇవ్వాలని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.

Covie Shield
Coiveshield Vaccine : కోవిషీల్డ్ టీకాను భారత మార్కెట్ లో రెగ్యులర్ గా అమ్ముకునేందుకు అనుమతులు ఇవ్వాలని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత అత్యధికంగా వినియోగించిన వ్యాక్సిన్లలో కోవి షీల్డ్ ఒకటి. భారతదేశంతోపాటు ఇతర దేశాలకు 100 కోట్లు కోవిషీల్డ్ డోసులను పంపింణీ చేయటాన్ని తన దరఖాస్తులో ప్రముఖంగా పేర్కోంది.
కోవిషీల్డ్‌ను పూణేకు చెందిన సీరం సంస్ధ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడు రోజుల క్రితం దేశంలోని వ్యాక్సిన్ తయారీ దారులతో సమావేశం అయిునప్పుడు సీరం సంస్ధ భారతడ్రగ్స్ కంట్రోలర్ జనరల్ కి దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం కొవిషీల్డ్ అత్యవసర వినియోగానికి భారత్‌లో అనుమతి ఉంది. దాన్ని రెగ్యులర్ మార్కెటింగ్‌లో అమ్ముకోటానికి ప్రభుత్వం అనుమతిస్తే ప్రపంచంలో అలాంటి ఆమోదం పొందిన రెండో వ్యాక్సిన్ అవుతుంది.
Also Read : Coronavirus Variant : దేశంలో కరోనా కొత్త వేరియంట్ కలకలం.. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా..
ఫైజర్-బయోఎన్‌టెక్‌కు చెందిన కరోనా టీకాకు ఇప్పటికే అమెరికా ఎఫ్‌డీఏ నుంచి పూర్తిస్థాయి అనుమతి లభించింది. కాగా, భారత్‌లో ఇప్పటి వరకు సుమారు 103 కోట్లకు పైగా డోసుల టీకా పంపిణీ జరిగింది. వీటిలో సుమారు 90 శాతం మంది కొవిషీల్డ్ టీకా వేయించుకోగా. భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ దాదాపు 10 శాతం మంది.. స్పుత్నిక్ వీ ఒక శాతం మంది వేయించుకున్నారు. భారీస్థాయిలో వ్యాక్సినేషన్‌కు కొవిషీల్డ్‌ను ఉపయోగించడమే అది సురక్షితమైనదని, సమర్థవంతమైనదనడానికి ధ్రువీకరణ అని సీరం సంస్ధ పేర్కొంది.