SIP Calculator : మీరు నెలకు రూ. 15వేల పెట్టుబడితో 25 ఏళ్లలో రూ. 4 కోట్లు సంపాదించవచ్చు.. ఈ సీక్రెట్ ఫార్ములా చాలామందికి తెలియదు.. !

SIP Calculator : రిటైర్మెంట్ సమయంలో డబ్బుల కోసం ఎవరిపై ఆధారపడకుండా జీవించాలంటే మంచి పథకాలలో పెట్టుబడి పెట్టాలి. మీరు SIPలో పెట్టుబడి పెట్టడం ద్వారా కేవలం 25 సంవత్సరాలలో కోటీశ్వరులు అవ్వొచ్చు.

SIP Calculator : మీరు నెలకు రూ. 15వేల పెట్టుబడితో 25 ఏళ్లలో రూ. 4 కోట్లు సంపాదించవచ్చు.. ఈ సీక్రెట్ ఫార్ములా చాలామందికి తెలియదు.. !

SIP Calculator

Updated On : April 15, 2025 / 6:03 PM IST

SIP Calculator : కోటీశ్వరుడు కావాలని ప్రతిఒక్కరికి ఉంటుంది. కానీ, కొందరు మాత్రమే భవిష్యత్తులో తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరు. ఇందుకు సరైన పెట్టుబడి ప్లానింగ్ ఉండాలి. అంతే ఓపికగా దీర్ఘకాలికంగా పెట్టుబడి పెడుతూ ఉండాలి. దీర్ఘకాలంలో మాత్రమే పెట్టుబడిపై అధిక లాభాలను పొందవచ్చు.

Read Also : Best Cooling AC : కొత్త ఏసీ కావాలా? రూ. 35వేల లోపు ధరలో టాప్ కూలింగ్ ఏసీలు ఇవే.. మీ ఇల్లంతా కూల్.. కూల్..!

మీరు 35 ఏళ్ల వయస్సులో సరైన పెట్టుబడి పెట్టడం ద్వారా 25 ఏళ్ల కోట్ల రూపాయలను సులభంగా సంపాదించవచ్చు. మ్యూచువల్ ఫండ్ SIP ద్వారా మీరు 60 ఏళ్ల వయస్సులోపు దాదాపు రూ. 4 కోట్ల కార్పస్‌ను సులభంగా పొందవచ్చు. ఇందుకోసం మీరు దాదాపు నెలకు రూ. 15వేలు SIPని ప్రారంభించాలి. ముందుగా మీరు 15+15+25 ఫార్ములా గురించి తెలుసుకోవాలి. ఈ అద్భుతమైన ఫార్ములాతో మీరు భవిష్యత్తులో కోట్ల రూపాయలను సంపాదించవచ్చు.

వాస్తవానికి, మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం. భవిష్యత్తులో తక్కువ మొత్తంలో పెట్టుబడి ద్వారా కోట్ల డబ్బులను సంపాదించవచ్చు. SIPలో పెట్టుబడి పెట్టడం ద్వారా స్టాక్ మార్కెట్ గురించి పెద్దగా అవగాహన ఉండాల్సిన పనిలేదు. అయితే, SIPలో పెట్టుబడి పెట్టే ముందు.. చివరి రాబడిని చూసి పెట్టుబడిని ప్లాన్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ స్థిర రాబడిని ఇవ్వవు. అది మార్కెట్‌పై ఆధారపడి ఉంటుందని తప్పక తెలుసుకోవాలి.

మీకు ప్రస్తుతం 35 ఏళ్లు ఉంటే.. మీరు రిటైర్మెంట్ సమయానికి రూ. 4 కోట్లకు పైగా డబ్బులను సంపాదించవచ్చు. రిటైర్మెంట్ కోసం కోట్లు కూడబెట్టాలంటే మీరు SIP ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఎంచుకోవాలి. అయితే, పెట్టుబడి పెట్టే ముందు మీకు సగటున 15 శాతం వార్షిక రాబడి వస్తుందని గమనించాలి. కేవలం 15శాతం రాబడితో మీరు 60 ఏళ్ల వయస్సులో లక్షాధికారి నుంచి కోటీశ్వరుడు కూడా కావచ్చు.

రూ. 15వేలతో SIPలో పెట్టుబడి :
మీరు రిటైర్మెంట్ తర్వాత డబ్బుల పరంగా ఇబ్బంది లేకుండా జీవించాలంటే మీరు వెంటనే రూ. 15వేల పెట్టుబడితో SIP ప్రారంభించవచ్చు. మీరు ఈ SIPని 25 ఏళ్లు ఆపకుండా కొనసాగిస్తే.. మీరు రూ. 4 కోట్లకు పైగా డబ్బులను కూడబెట్టవచ్చు. అయితే, ఈ కోట్ల డబ్బు సంపాదించాలంటే మీరు ఆపకుండా ఓపికగా ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం కొనసాగించాలి.

మీరు రూ. 4 కోట్లు సంపాదించాలంటే.. SIPలో 15+15+25 ఫార్ములా ప్రకారం… ప్రతి నెలా 15వేలు పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడిపై మీరు సగటున సంవత్సరానికి 15 శాతం రాబడిని పొందవచ్చు. దీని ప్రకారం.. 25 సంవత్సరాలలో మీ పెట్టుబడి మొత్తం రూ. 45,00,000 అవుతుంది. ఈ పెట్టుబడిపై మీకు దాదాపు రూ. 3,68,48,412 వడ్డీ లభిస్తుంది. వడ్డీ, పెట్టుబడి మొత్తాన్ని కలుపుకుంటే.. మొత్తం కూడబెట్టిన డబ్బు దాదాపు రూ. 4,13,48,412 కోట్లు అవుతుంది.

Read Also : Kedarnath Yatra 2025 : కేదార్‌నాథ్ యాత్ర కోసం IRCTC హెలికాప్టర్ సర్వీసులు.. ఏయే రూట్లలో వెళ్లొచ్చు.. బుకింగ్ ఎలా? ధర ఎంతంటే?

మీరు ఈ రూ.15వేల పెట్టుబడిని 12శాతం వార్షిక రాబడి రేటుతో లెక్కిస్తే.. రూ.2 కోట్లు అదనంగా ఉంటుంది. మీ 25 ఏళ్ల పెట్టుబడితో రూ. 45,00,000 అవుతుంది. ఈ పెట్టుబడిపై 12 శాతం రాబడి రేటుతో వడ్డీ రూ. 2,10,33,099 అవుతుంది. ఇందులో రూ. 2,10,33,099, పెట్టుబడిని కలపడం ద్వారా మొత్తంగా డబ్బులు రూ. 2,55,33,099కి దగ్గరగా ఉంటుంది. అదే 15 శాతం రాబడితో అదే 25 ఏళ్లలో రూ. 4 కోట్లకు పైగా డబ్బులను కూడబెట్టవచ్చు.

Note : ఈ పెట్టుబడి సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమేనని గమనించాలి. మీరు ఏదైనా SIPలో పెట్టుబడి పెట్టే ముందు రాబడి మొదలైన వాటి గురించి మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.