SIP Calculator : SIPలో నెలకు ఇలా పెట్టుబడి పెట్టండి.. కేవలం 10 ఏళ్లలోనే లక్షాధికారేంటి? ఏకంగా కోటీశ్వరుడే అవ్వొచ్చు.. ఎలాగంటే?
SIP Calculator : SIPలో పెట్టుబడి పెడుతున్నారా? ఇలా పక్కా ప్లానింగ్‌తో నెలకు పెట్టుబడి పెడితే 10ఏళ్లలోనే కోటీశ్వీరుడు అయిపోవచ్చు.. ఎలాగంటే?

SIP Calculator
SIP Calculator : డబ్బులు అందరూ సంపాదిస్తారు.. సేవింగ్ చేయడం అందరికి సాధ్యం కాదు.. కొందరే సేవింగ్స్ విషయంలో పక్కా ప్లానింగ్‌తో ఉంటారు. చిన్న పెట్టుబడులతో (SIP Calculator) కూడా భవిష్యత్తులో భారీ మొత్తంలో సంపాదించుకోవచ్చు. ఇందుకు మార్కెట్లో అనేక మార్గాలు ఉన్నాయి. అందులో ఎక్కువగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్‌ప్లాన్ (SIP)లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతుంటారు.
ఎందుకంటే.. మీరు పెట్టే కొద్ది మొత్తంలో పెట్టుబడి రాబోయే రోజుల్లో మిమ్మిల్ని లక్షాధికారి చేస్తుంది. మంచి ప్లానింగ్ తో పెట్టుబడిని కొనసాగిస్తే అదే పదేళ్లలో కోట్లు సంపాదించి కోటిశ్వీరుడు కూడా అయిపోవచ్చు. ఒకరిపై ఆధారపడాల్సిన పని ఉండదు.
మీరు దాచుకున్న డబ్బులను మీరే హాయిగా అవసరాలకు ఖర్చుపెట్టుకోవచ్చు. ఇందుకోసం ఇప్పటినుంచే పెట్టుబడి పెట్టడం కొనసాగించాలి. మీరు కేవలం 10 ఏళ్లలో లక్షాధికారి లేదా కోటిశ్వీరుడు ఎలా అవ్వగలరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
10 ఏళ్లలో SIPతో లక్షాధికారి ఎలా? :
ప్రస్తుత రోజుల్లో చాలా మంది బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు పథకాలను పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు ఎందుకంటే.. మంచి రాబడిని ఇస్తాయి. మేనేజ్ ఈజీగా చేయొచ్చు. లాంగ్ టైమ్ సేవింగ్ చేయొచ్చు.
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) అద్భుతంగా ఉంటుంది. SIPతో ప్రతి నెలా ఒక స్థిర మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా కొన్ని ఏళ్లలోనే లక్షాధికారి అయిపోవచ్చు. అంటే.. SIPలో ప్రతి ఏడాదికి దాదాపు 12శాతం రాబడిని పొందవచ్చు.
రూ. కోటి సంపాదించాలంటే? :
ఒకవేళ.. మీకు మంచి ప్లానింగ్ ఉంటే.. కేవలం 10 ఏళ్లలోనే రూ. 1 కోటి సంపాదించుకోవచ్చు. మీరు ప్రతి నెలా రూ. 43,500 పెట్టుబడి పెట్టాలి. 10 ఏళ్లల్లో మీ మొత్తం పెట్టుబడి రూ. 52,20,000 అవుతుంది. దీనిపై రూ.48,86,749 రాబడి వస్తుంది. మీ మొత్తం ఫండ్ రూ. 1,01,06,749 అవుతుంది.
చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే? :
మీరు ప్రారంభం నుంచే రూ.43,500 పెట్టుబడి పెట్టలేకపోతే.. స్టెప్-అప్ SIP ఎంచుకోవచ్చు. ఇందులో చిన్న మొత్తంతో పెట్టుబడిని ప్రారంభించి ప్రతి ఏడాది పెంచుతూ వెళ్లాలి. ఉదాహరణకు.. మీరు రూ. 30వేలతో SIPలో పెట్టుబడి పెడితే.. ప్రతి ఏడాదిలో 10శాతం పెంచితే.. మీ మొత్తం పెట్టుబడి రూ. 57,37,472 అవుతుంది. మీకు రూ. 43,85,505 లక్షల రాబడి వస్తుంది. అప్పుడు మీ మొత్తం SIP ఫండ్ రూ. 1,01,22,978 (రూ. కోటి) పొందవచ్చు.
అందుకే.. ప్రారంభం నుంచే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలని భావించే వారికి రెగ్యులర్ SIP బెస్ట్ ప్లాన్. మీ ఆదాయం ప్రతి ఏడాది పెరుగుతుంటే.. స్టెప్-అప్ SIP చాలా మంచిది. కానీ, ద్రవ్యోల్బణం పరంగా మ్యూచువల్ ఫండ్లు చాలా డేంజర్. ఇలాంటి ఆదాయంపై టాక్స్ కూడా పడుతుంది. అందుకే.. ఇందులో పెట్టుబడి పెట్టే ముందు మీకు తెలిసిన ఆర్థిక నిపుణుల సలహా, సూచనలు తీసుకోవాలి.