బంగారం ధరలు పెరిగిపోవడానికి కారణాలేంటి? ఇప్పుడు కొనడం సేఫేనా?

గోల్డ్ ను టచ్ చేయాలంటే జేబుల్లో పెద్ద కరెన్సీ కట్టలు, ఆన్ లైన్ లో అంకెల బ్యాలెన్స్ గట్టిగానే ఉండాలి మరి.

బంగారం ధరలు పెరిగిపోవడానికి కారణాలేంటి? ఇప్పుడు కొనడం సేఫేనా?

Gold Rush (Photo Credit : Google)

Updated On : October 19, 2024 / 12:40 AM IST

Gold Rush : రా బంగారం.. ప్లీజ్ దిరిగా రా బంగారం.. నా బుజ్జి కదా.. ఇంకొంచెం తగ్గమ్మా.. ఇలాగే బతిమలాడుతున్నారు గోల్డ్ ప్రియులు. అవును.. బంగారం దిగి రానంటోంది. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. అసలే పండుగల సీజన్. దీనికి తోడు త్వరలో పెళ్లి ముహూర్తాలు ముంచుకొస్తున్నాయి. దీంతో గోల్డ్ సేల్స్ ఊపందుకుంటున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో దేశంలో 35 లక్షల జంటలు పెళ్లితో ఒక్కటి కాబోతున్నాయి. అంటే కొనుగోలుకు పట్టపగ్గాలు ఉండవు. ఇక చెప్పేదేముంది. గోల్డ్ ను టచ్ చేయాలంటే జేబుల్లో పెద్ద కరెన్సీ కట్టలు, ఆన్ లైన్ లో అంకెల బ్యాలెన్స్ గట్టిగానే ఉండాలి మరి.

పెళ్లిళ్లు, పండుగల సీజన్ మాత్రమే కాదు.. యుద్ధాలు కూడా బంగారం ధరలకు రెక్కలు తొడుగుతాయి. గ్లోబల్ మార్కెట్ లోని పరిణామాలు కూడా పసిడి రేట్లను పరుగులు పెట్టిస్తున్నాయి. హమాస్ లీడర్ సిన్వర్ హత్య తర్వాత మిడిల్ ఈస్ట్ లో యుద్ధ సైరన్ వినిపిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు బంగారంవైపు చూస్తున్నారు. పసిడి కొనేందుకు ఎగబడుతున్నారు. ఇటు అంతర్జాతీయ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తోంది. దీంతో ఇన్వెస్టర్లకు బంగారమే సురక్షితమైన మార్గమైంది.

పండుగలు, పెళ్లిళ్లు మాత్రమే కాదు.. మరోవైపు ప్రపంచంలో నెలకొన్న యుద్ధ వాతావరణం కూడా గోల్డ్ ధరలను పెంచుతున్నాయి. ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయడం సురక్షితమైన మార్గంగా ఇన్వెస్టర్స్ భావిస్తున్నారు. దీంతో పుత్తడి ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ తో లెబనాన్, హిజ్బొల్లా వార్.. ఉత్తర-దక్షిణ కొరియాల మధ్య యుద్ధ వాతావరణం.. గోల్డ్ కు డిమాండ్ పెంచుతోంది. దీంతో ఈ వారం ప్రారంభం నుంచి గోల్డ్ రేట్ పైపైకి వెళ్తోంది. రాబోయే రోజుల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

మరోవైపు యూఎస్ ఎన్నికలకు మూడు వారాల సమయం ఉంది. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్.. పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించనున్నాయని.. అంచనాలు కూడా ఉన్నాయి. దీంతో ఆటోమేటిక్ గా గోల్డ్ రేట్లకు బూస్టింగ్ ఇచ్చాయి. అమెరికా ఎకానమీ డేటా స్ట్రాంగ్ గా ఉండటంతో డాలర్ మారకం విలువ బలపడింది. ఈ పరిస్థితుల వల్ల ప్రజలు బంగారంపై తమ డబ్బులను ఖర్చు చేస్తున్నారు. జియో పొలిటికల్ టెన్షన్ తో పాటు గ్లోబల్ మార్కెట్ లో తొలిసారిగా గోల్డ్ రేట్ 2వేల 700 మార్కును క్రాస్ చేసింది.

Also Read : దావూద్‌కి, లారెన్స్ బిష్ణోయ్‌కి పోలికలు ఏంటి? బాలీవుడ్‌ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు?