నష్టాల్లో స్టాక్ మార్కెట్

  • Published By: madhu ,Published On : October 3, 2019 / 05:02 AM IST
నష్టాల్లో స్టాక్ మార్కెట్

Updated On : October 3, 2019 / 5:02 AM IST

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మార్కెట్లు ప్రతికూల సంకేతాలు రావడంతో సెన్సెక్స్ 309, నిఫ్టీ 96 పాయింట్లు పతనమయ్యాయి. దీంతో సెన్సెక్స్ 38 వేల దిగువకు చేరింది. అదే బాటలో నిఫ్టీ కూడా పయనిస్తోంది. 11 వేల 300 స్థాయిని కోల్పోయింది. దాదాపు అన్ని రంగాలు నష్టపోతున్నట్లు సమాచారం. ప్రధానంగా బ్యాకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంటోంది.

YES BANK మాత్రం భారీ లాభాలతో ట్రేడ్‌ని ఆరంభించింది. భారతీ ఎయిర్ టెల్ 2.5 శాతం, సన్ ఫార్మా 2 శాతం నష్టపోయాయి. టాటా మోటార్స్ 1.6 శాతం, హీరో మోటో కార్స్ 1 శాతం లాభపడ్డాయి. బ్యాంక్ నిఫ్టీ 1.21 శాతం, నిఫ్టీ మెటల్ విభాగం 2 శాతం, ఫార్మా విభాగం 1.5 శాతం, ప్రైవేటు బ్యాంకు సూచి 1.3 శాతం నష్టపోన్నాయి. ఐషర్ మోటార్స్, ఐటీసీ, బజాజ్ షేర్లు లాభాల బాటలో కొనసాగుతున్నాయి. 

భారతదేశ ఉత్పాదక రంగంలో వృద్ధి బలహీనంగా ఉందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యుఎస్ – చైనా మధ్య వాణిజ్య యుద్ధం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపెడుతోందంటున్నారు.