స్టాక్ మార్కెట్లకు భారీ షాక్

  • Published By: venkaiahnaidu ,Published On : August 22, 2019 / 12:57 PM IST
స్టాక్ మార్కెట్లకు భారీ షాక్

Updated On : August 22, 2019 / 12:57 PM IST

స్టాక్‌ మార్కెట్లు ఇవాళ(ఆగస్టు-22,2019) భారీగా పతనమయ్యాయి. మదుపుదారులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో రియల్టీ, మెటల్‌, ఆటో, పీఎస్‌యూ షేర్లు భారీగా నష్టపోయాయి. మార్కెట్‌లోకి మళ్లే విదేశీ పెట్టుబడులపై బడ్జెట్‌లో పొందుపరిచిన పన్ను ప్రతిపాదనలపైనా కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం, ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపే ఉద్దీపన ప్యాకేజ్‌పై సైతం ఎలాంటి కదలికా లేకపోవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది.

587 పాయింట్లు నష్టపోయిన BSE S&P సెన్సెక్స్‌ 36,473 పాయింట్ల దగ్గర  ముగియగా 181 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 10,750 పాయింట్ల వద్ద క్లోజయింది. ఇక యస్‌ బ్యాంక్‌, వేదాంత, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ తదితర షేర్లు నష్టపోగా, టీసీఎస్‌, హెసీఎల్‌ టెక్‌ షేర్లు లాభపడ్డాయి.