Swadesh x Falguni Shane : హైదరాబాద్‌లో స్వదేశ్, ఫాల్గుణి షేన్ పీకాక్ లిమిటెడ్ ఎడిషన్ దుస్తుల ఆవిష్కరణ!
Swadesh x Falguni Shane : ఈ సేకరణలో కాంజీవరం సిల్క్స్, చికంకారీ ఎంబ్రాయిడరీ, బనారసి బ్రోకేడ్స్ వంటి ఐకానిక్ భారతీయ హస్తకళలు ఉన్నాయి. రెండు బ్రాండ్ల నైతికతను తగినట్టుగా రూపొందించారు.

Swadesh x Falguni Shane Peacock Unveil Limited Edition Couture in Hyderabad
Swadesh x Falguni Shane : భారతీయ స్వదేశీ బ్రాండ్, అంతర్జాతీయ వస్త్ర తయారీదారులు ఫాల్గుణి షేన్ పీకాక్ హైదరాబాద్‌లోని స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లో దుస్తులను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా దుస్తుల ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఇండియా కోచర్ వీక్‌లో ప్రదర్శించిన వస్త్రధారణతోపాటు ఫాల్గుణి షేన్ పీకాక్ 20వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. సంప్రదాయ పద్ధతుల్లో అత్యాధునిక ఫ్యాషన్ డిజైన్‌తో స్వదేశ్ ఫాల్గుణి, షేన్ పీకాక్‌తో పనిచేస్తున్నారు.
ఈ సేకరణలో కాంజీవరం సిల్క్స్, చికంకారీ ఎంబ్రాయిడరీ, బనారసి బ్రోకేడ్స్ వంటి ఐకానిక్ భారతీయ హస్తకళలు ఉన్నాయి. రెండు బ్రాండ్ల నైతికతను తగినట్టుగా రూపొందించారు. స్వదేశ్‌లో ప్రత్యేకంగా లభించే ఈ లిమిటెడ్ ఎడిషన్ కోచర్, అనేక కళాఖండాల ద్వారా భారతీయ హస్తకళా వారసత్వం, వినూత్న డిజైన్‌తో పాటు అద్భుతమైన కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఫాల్గుణి షేన్ పీకాక్ 20ఏళ్ల కాలంలో లగ్జరీ కోచర్ డిజైనర్లుగా స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ బ్రాండ్ ప్రతి సీజన్‌కు లగ్జరీ లుక్స్ తీసుకొస్తోంది.
ఫాల్గుణి షేన్ పీకాక్ సంప్రదాయ కళానైపుణ్యాన్ని ప్రతి సీజన్‌లో ఫొటోలు, రంగులతో విస్తరిస్తుంది. వర్చువల్ స్టైలింగ్ వంటి మార్గదర్శక ఫీచర్లతో డిజైన్ సెన్సిబిలిటీస్, టెక్నాలజీ పరంగా బ్రాండ్ అభివృద్ధి చెందింది. డిజైనర్లు క్లాసిక్ డిజైన్ ద్వారా సెలబ్రిటీలకు నచ్చేలా రూపొందిస్తారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ సేకరణలో క్లిష్టమైన జరీ వర్క్‌తో బెస్పోక్ చీరలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని స్వదేశ్ స్టోర్‌లో ఈ ప్రత్యేక దుస్తులను సేకరించవచ్చునని ఫాల్గుణి షేన్ పీకాక్ సహ వ్యవస్థాపకుడు ఫాల్గుణి పీకాక్ చెప్పారు.
Read Also : Poco Pad 5G Launch : పోకో ప్యాడ్ 5జీ టాబ్లెట్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?