రుణాలిస్తాం-వ్యాపారాలు అభివృధ్ది చేసుకోండి

  • Published By: chvmurthy ,Published On : December 22, 2019 / 11:26 AM IST
రుణాలిస్తాం-వ్యాపారాలు అభివృధ్ది చేసుకోండి

Updated On : December 22, 2019 / 11:26 AM IST

బ్యాంకుల వద్ద నిధుల కొరత లేదని..ఔత్సాహికులకు, పారిశ్రామికవర్గాలకు లోన్లు  ఇస్తాం..పెట్టుబడి పెట్టుకుని వ్యాపారాలు అభివృధ్ది చేసుకోమంటున్నారు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ రజ్నీశ్ కుమార్. వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్లా మరిన్ని బ్యాంకులు ఆర్థికంగా పరిపుష్ఠం అవుతాయని ఆయన తెలిపారు.
 
ఈ క్రమంలోనే బ్యాంకుల వద్ద రుణాలు పొంది, ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టి, వ్యాపారాలు అభివృధ్ది చేసుకోవాలని పారిశ్రామిక వర్గాలకు సూచించారు. దీనివల్ల రుణ పరపతి పెరుగుతుందని సలహా ఇచ్చారు. 

ఫిక్కీ 92వ వార్షిక సదస్సులో మాట్లాడుతూ ఆయన  భారత్.. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని అందుకోవాలంటే భారీగా పెట్టుబడులు అవసరం. నేడు బ్యాంకింగ్ క్రెడిట్ పరిమాణం రూ.96 లక్షల కోట్లుగా ఉన్నది. 5 లక్షల కోట్ల డాలర్ల జీడీపీ సాధనకు ఈ పరిమాణం రెట్టింపు కావాల్సిన అవసరం ఉంది అన్నారు.