Tata Altroz : అత్యంత సరసమైన ధరలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో టాటా ఆల్ట్రోజ్ 2 కొత్త వేరియంట్‌లు..!

Tata Altroz : మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా, హ్యుందాయ్ i20 వంటి వాటితో పోటీగా టాటా ఆల్ట్రోజ్ నుంచి రెండు కొత్త వేరియంట్లు లాంచ్ అయ్యాయి.

Tata Altroz : అత్యంత సరసమైన ధరలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో టాటా ఆల్ట్రోజ్ 2 కొత్త వేరియంట్‌లు..!

Tata Altroz gets 2 new variants, electric sunroof now made more affordable

Updated On : July 21, 2023 / 6:35 PM IST

Tata Altroz : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) ఆల్ట్రోజ్ లైనప్‌లో XM, XM(S) అనే 2 కొత్త వేరియంట్‌లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. XM ధర రూ. 6.90 లక్షలు (ఎక్స్-షోరూమ్), XM(S) రూ. 7.35 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది. టాటా ఆల్ట్రోజ్ 2 కొత్త వేరియంట్‌లు 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్‌తో అందిస్తుంది.

5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చింది. ఈ మోటార్ గరిష్టంగా 88PS పవర్, 115Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త Tata Altroz ​​XM వేరియంట్‌లో స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, హైట్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఎలక్ట్రికల్-అడ్జస్టబుల్, ఫోల్డబుల్ ORVMలు వంటి ఫీచర్లు ఉంటాయి. XM(S) అదనంగా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉంటుంది.

Read Also : Nothing Phone (2) Discount : నథింగ్ ఫోన్ (2)పై ఓపెన్ సేల్.. అదిరే డిస్కౌంట్.. కొనే ముందు ఈ ఫీచర్లు ఉన్నాయో లేదో చెక్ చేయండి..!

XM, XM(S) వేరియంట్‌లు XE, XM+ వేరియంట్‌ల మధ్య ఉంచుతుంది. అలాగే, ఆల్ట్రోజ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో అత్యంత సరసమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా మారింది. అంతేకాకుండా, ఆల్ట్రోజ్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్‌లలో 4 పవర్ విండోలను, రిమోట్ కీలెస్ ఎంట్రీని ప్రామాణికంగా కలిగి ఉంది. అలా కాకుండా, టాటా XM+, XM+S వేరియంట్‌లకు రివర్స్ కెమెరా, హైట్-ఎడ్జెస్ట్ డ్రైవర్ సీటు, క్రూయిజ్ కంట్రోల్‌లను యాడ్ చేసింది. టాటా ఆల్ట్రోజ్, మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా, హ్యుందాయ్ i20 వంటి వాటితో పోటీగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.

టాటా ఆల్ట్రోజ్ ఇంజిన్ :
ఈ రెండు కొత్త వేరియంట్లలో 86.79 bhp, 115Nm టార్క్ ఉత్పత్తి చేసే మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో టాటా మోటార్స్ 1.2L రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చింది. ఇంజిన్ BS 6 స్టేజ్ 2 కంప్లయింట్, 19.33 kmpl ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది.

Tata Altroz gets 2 new variants, electric sunroof now made more affordable

Tata Altroz gets 2 new variants, electric sunroof now made more affordable

టాటా ఆల్ట్రోజ్ కొత్త వేరియంట్లలో ఫీచర్లు :
టాటా ఆల్ట్రోజ్ కొత్తగా ప్రవేశపెట్టిన XM, XM S వేరియంట్లలో అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.
* స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోలింగ్
* డ్రైవర్ సీటు హైట్ అడ్జెస్ట్
* ఎలక్ట్రికల్ అడ్జెస్ట్, పోల్డబుల్ ORVMs
* R16 ఫుల్ వీల్ కవర్
* ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ (XM S మాత్రమే)
* భారీ ఇన్ఫోటైన్‌‌మెంట్ సిస్టమ్
* 4 పవర్ విండోస్
* రిమోట్ కీలెస్ ఎంట్రీ

Read Also : Netflix New Subscribers : నెట్‌ఫ్లిక్స్ వ్యూహం ఫలించింది.. పాస్‌వర్డ్ షేరింగ్ ఆపేసింది.. కొత్తగా 6 మిలియన్ల సబ్‌స్ర్కైబర్లు..!