Tata Cars Booking : కొత్త కారు కొంటున్నారా? ఈ టాటా సీఎన్‌జీ ఎఎమ్‌టి కార్లపై బుకింగ్స్ ప్రారంభం.. ఆన్‌‌లైన్‌లో టోకెన్ ధర ఎంతంటే?

Tata Cars Booking : సీఎన్‌జీ కార్లలో (AMT)ని ప్రవేశపెట్టిన మొదటి కంపెనీ టాటా మోటార్స్. ఇప్పుడు టియాగో సిఎన్‌జి ఎఎమ్‌టి, టిగోర్ సిఎన్‌జి ఎఎమ్‌టి కోసం బుకింగ్స్ ప్రారంభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Tata Cars Booking : కొత్త కారు కొంటున్నారా? ఈ టాటా సీఎన్‌జీ ఎఎమ్‌టి కార్లపై బుకింగ్స్ ప్రారంభం.. ఆన్‌‌లైన్‌లో టోకెన్ ధర ఎంతంటే?

Tata Motors opens bookings for Tiago CNG AMT, Tigor CNG AMT

Tata Cars Booking : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ దిగ్గజం టాటా మోటార్స్ టియాగో సీఎన్‌జీ ఎఎమ్‌టీ, టిగోర్ సీఎన్‌జీ ఎఎమ్‌టీ కార్ల కోసం రూ. 21వేల టోకెన్ మొత్తానికి బుకింగ్‌లను ప్రారంభించింది. ఒక కంపెనీ సీఎన్‌జీ కార్లలో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT)ని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. టియాటో సీఎన్‌జీ ఎఎమ్‌టీ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

Read Also : Royal Enfield Bullet 350 : కొత్త బుల్లెట్ బండి కొంటున్నారా? రాయల్ బుల్లెట్ 350 సిల్వర్ వేరియంట్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

అందులో XTA, XZA+, XZA NRG ఉండగా.. టిగోర్ సీఎన్‌జీ ఎఎమ్‌టీ XZA CNG, XZA+ CNG అనే రెండు వేరియంట్‌లను కలిగి ఉంది. టాటా మోటార్స్ సీఎన్‌జీ కార్లలో స్థలాన్ని ఖాళీ చేసేందుకు లగేజ్ ఏరియా కింద బూట్‌లో ట్విన్ సిలిండర్లు ఉన్నాయి. ఒకే-అధునాతన ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్‌ను కలిగి ఉన్నాయి. నేరుగా సీఎన్‌జీ మోడ్‌లో ప్రారంభించవచ్చు.

Tata Motors opens bookings for Tiago CNG AMT, Tigor CNG AMT

Tiago CNG AMT, Tigor CNG AMT

కొత్త కలర్ ఆప్షన్లలో రెండు వేరియంట్లు :
టియాగో, టిగోర్‌లు ఒకే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉన్నాయి. పెట్రోల్ మోడ్‌లో 86పీఎస్ 113ఎన్ఎమ్ సీఎన్‌జీ మోడ్‌లో 73.4పీఎస్ 95ఎన్ఎమ్‌లను అభివృద్ధి చేస్తుంది. పెట్రోల్ సీఎన్‌జీ వెర్షన్లు రెండూ ఇప్పుడు 5-స్పీడ్ ఎంటీ, 5-స్పీడ్ ఎఎమ్‌టీ ఆప్షన్లను కలిగి ఉన్నాయి. టాటా మోటార్స్ టియాగోలో టోర్నాడో బ్లూ, టియాగో ఎన్‌ఆర్‌జిలో గ్రాస్‌ల్యాండ్ బీజ్, టిగోర్‌లోని మెటోర్ బ్రాంజ్ వంటి కొత్త కలర్ ఆప్షను కూడా ప్రవేశపెట్టింది. టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్ పంచ్ అనే 4 మోడళ్లలో కంపెనీ సీఎన్‌జీ ఆప్షన్ అందిస్తుంది.

కంపెనీ టియాగోలో ఆసక్తికరమైన కొత్త టొర్నాడో బ్లూ, టియాగో ఎన్‌ఆర్‌జిలో గ్రాస్‌ల్యాండ్ బీజ్, టిగోర్‌లో మెటోర్ బ్రాంజ్‌ను కూడా ప్రవేశపెట్టింది. టాటా మోటార్స్ టియాగో, టిగోర్ కార్లను లాంచ్ చేసినప్పటి నుంచి కీలకమైన మైలురాళ్లను సాధించాయి. కంపెనీ కొత్త డిజైన్ ఫిలాసఫీని అందించాయి.

Tata Motors opens bookings for Tiago CNG AMT, Tigor CNG AMT

Tata Motors opens bookings 

భవిష్యత్ మోడళ్లకు మార్గం సుగమం చేశాయి. సంవత్సరాలుగా టియాగో, టిగోర్ మల్టీ-పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు, ఆకర్షణీయమైన డిజైన్, అసాధారణమైన భద్రతా ఫీచర్లు, ఫీచర్-రిచ్ ఇంటీరియర్స్, అత్యాధునిక సాంకేతికత ఇంటిగ్రేషన్ కారణంగా అనేక మంది యువ, డైనమిక్ కస్టమర్‌లలో విపరీతమైన ప్రజాదరణ పొందాయి. కంపెనీ ఇప్పుడు సీఎన్‌జీ సీఎన్‌జీ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. ఈ సీఎన్‌జీలో ఆటోమేటిక్ టెక్నాలజీ అవసరాన్ని పరిష్కరిస్తోంది.

నివేదిక ప్రకారం.. ఎఫ్‌వై23తో పోలిస్తే.. ఎఫ్‌వై 24లో సీఎన్‌జీ పరిశ్రమ 40.5శాతం గణనీయమైన వృద్ధిని సాధించింది. టాటా మోటార్స్ ప్రస్తుతం సీఎన్‌జీ స్పేస్‌లో విశాలమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. ఈ ఆప్షన్లలో టియాగో, టిగోర్, అల్ట్రోజ్ పంచ్‌లను అందిస్తోంది. సీఎన్‌జీ మార్కెట్‌లో గత సంవత్సరంతో పోలిస్తే.. ఎఫ్‌వై24లో సీఎన్‌జీ అమ్మకాల్లో 67.9శాతం వృద్ధితో టాప్ 2 బ్రాండ్‌లలో ఒకటిగా ఉంది.

Read Also : Apple Vision Pro Sale : ఫిబ్రవరి 2న ఆపిల్ విజన్ ప్రో సేల్.. ఈ హెడ్‌సెట్ రిపేరింగ్ ఖర్చు రూ.2 లక్షల పైమాటే..!