Tata Punch EV Launch : భారత అత్యంత చిన్నదైన టాటా పంచ్ ఈవీ ఎస్‌యూవీ కారు వచ్చేస్తోంది.. సింగిల్ ఛార్జ్‌తో 375కి.మీ దూసుకెళ్లగలదు!

Tata Punch EV Launch : టాటా మోటార్స్ భారత మార్కెట్లో అత్యంత చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన పంచ్ ఈవీని జనవరి 17న లాంచ్ చేయనుంది. రూ. 21వేల టోకెన్ మొత్తానికి బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

Tata Punch EV Launch : భారత అత్యంత చిన్నదైన టాటా పంచ్ ఈవీ ఎస్‌యూవీ కారు వచ్చేస్తోంది.. సింగిల్ ఛార్జ్‌తో 375కి.మీ దూసుకెళ్లగలదు!

Tata Punch EV launch on Jan 17_ India's smallest electric SUV's expected price

Updated On : January 13, 2024 / 10:51 PM IST

Tata Punch EV Launch : భారత్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లలో అనేక మార్పులు చేసింది. ఇప్పుడు, మరో పెద్ద మార్పు ఉండనుంది. ఎందుకంటే.. టాటా మోటార్స్ భారత మార్కెట్లో అతి చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన పంచ్ ఈవీతో సెగ్మెంట్‌లోనే మరో విప్లవాన్ని ప్రారంభించనుంది.

ఎలక్ట్రిఫైడ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ జనవరి 17న లాంచ్ కానుంది. రూ. 21వేల టోకెన్ మొత్తానికి బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. స్మార్ట్, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎమ్‌పవర్డ్ అనే 4 వేరియంట్‌లలో అందుబాటులో ఉండనుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 నుంచి 375 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుందని అంచనా.

Read Also : Best Premium Flagship Phones : 2024 జనవరిలో భారత్‌లో కొనుగోలు చేయగల బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

టాటా పంచ్ ఈవీ ఫీచర్లు (అంచనా) :
టాటా మోటార్స్ రాబోయే ఈవీ గురించి కొన్ని వివరాలను అందించింది. ఎక్స్‌‌ట్రియర్ కొన్ని ఆసక్తికరమైన ఫీచర్ల గురించి వివరాలను షేర్ చేసింది. టాటా పంచ్ జెన్-2 ఈవీ ఆర్కిటెక్చర్ ఆధారంగా ఈవీ డిజైన్ నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ నుంచి ప్రేరణ పొందింది. ప్రత్యేకించి పూర్తి వెడల్పు ఎల్ఈడీ లైట్ బార్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. బంపర్, గ్రిల్ డిజైన్ కూడా నెక్సన్ అందించనుంది. ముందు బంపర్‌లో స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, నిలువు స్ట్రెక్‌లతో కూడిన కొత్త బాటమ్ బంపర్, సిల్వర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

Tata Punch EV launch on Jan 17_ India's smallest electric SUV's expected price

Tata Punch EV launch on Jan 17 

పంచ్ ఈవీ ప్రత్యేకత ఏమిటంటే.. :
టాటా నుంచి ఫ్రంట్-మౌంటెడ్ ఛార్జర్‌ను కలిగిన మొదటి ఎలక్ట్రిక్ కారు. బ్రాండ్ లోగో కింద ఉంటుంది. టాటా పంచ్ ఈవీ.. కార్‌మేకర్ రాబోయే మోడల్ పవర్‌ట్రెయిన్ వివరాలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, మనకు తెలిసిన విషయం ఏమిటంటే.. స్టాండర్డ్, లాంగ్ రేంజ్ అనే రెండు వేరియంట్‌లలో వచ్చే అవకాశం ఉంది. టాటా పంచ్ ఈవీ.. సింగిల్ ఛార్జ్‌తో 300 నుంచి 375 కిలోమీటర్ల మధ్య దూరాన్ని అందుకోగలదు.

ధర ఎంత ఉండొచ్చుంటే? :
ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలకు సరిపోతుంది. టాటా పంచ్ ఈవీ నేరుగా సిట్రోయెన్ ఇసీ3తో హార్న్‌లను లాక్ చేస్తుంది. ఈ కంపెనీ మోడల్‌ రూ. 11లక్షల నుంచి 13 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ధర ఉంటుందని భావించవచ్చు. భారత ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్‌మేకర్ ఈ కొత్త ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెడుతోంది.

Read Also : Raptee Energy e-Bike : రాప్టీ ఎనర్జీ కొత్త ఇ-బైక్ వచ్చేస్తోంది.. 150కి.మీ రేంజ్‌తో దూసుకెళ్లగలదు..!