TCL C755 Mini LED TVs : కొంటే ఇలాంటి టీవీ కొనాలి.. టీసీఎల్ సి755 మినీ 4K ఎల్ఈడీ టీవీ చూశారా? ధర ఎంతంటే?

TCL C755 Mini LED TVs : కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో టీసీఎల్ కంపెనీ కొత్త మినీ టీవీని ప్రత్యేక ఆఫర్లతో అందిస్తోంది. టీసీఎల్ సి755 4కె క్యూడీ మినీ ఎల్ఈడీ టీవీలను వేర్వేరు సైజుల్లో ఆఫర్ చేస్తోంది. పూర్తి వివరాలివే..

TCL C755 Mini LED TVs : కొంటే ఇలాంటి టీవీ కొనాలి.. టీసీఎల్ సి755 మినీ 4K ఎల్ఈడీ టీవీ చూశారా? ధర ఎంతంటే?

TCL C755 4K QD Mini LED TVs With Dolby Vision

Updated On : January 10, 2024 / 5:15 PM IST

TCL C755 Mini LED TVs : కొత్త స్మార్ట్‌టీవీ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో టీసీఎల్ కొత్త మినీ టీవీ అమ్మకానికి అందుబాటులో ఉంది. టీసీఎల్ సి755 4కె క్యూడీ మినీ ఎల్ఈడీ మోడల్స్ ఇప్పుడు దేశంలో అమెజాన్ ద్వారా ప్రత్యేక ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి ఈ లైనప్ అక్టోబర్ 2023లో దేశంలో లాంచ్ అయింది.

Read Also : Apple iPhone 14 Discount : అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్.. ఈ ఫోన్ కొనాలా? వద్దా?

టీసీఎల్ సి755 ఐదు వేర్వేరు సైజుల్లో అందిస్తోంది. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సపోర్టు ఇస్తుంది. టీవీ స్లిమ్, యూని-బాడీ డిజైన్‌ను కలిగి ఉంది. మినీ ఎల్ఈడీ టెక్నాలజీతో కూడిన ఫ్లాట్, విఏ ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ టెలివిజన్ సెట్ ఏఐపీక్యూ ప్రాసెసర్ 3.0 ద్వారా ఆధారితమైనది. ఐఎమ్ఎక్స్ మెరుగైన ఎక్స్‌పీరియన్స్ అందజేస్తుందని పేర్కొంది.

భారత్‌లో టీసీఎల్ సి755 4కె క్యూడీ మినీ ఎల్ఈడీ ధర :
టీసీఎల్ సి755 4కె క్యూడీ మినీ ఎల్ఈడీ టీవీ ఐదు వేర్వేరు సైజుల్లో భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. 55-అంగుళాల మోడల్ ధర రూ. 74,990 ఉండగా.. రూ. 2వేల కూపన్ జనవరి 12 వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ మోడల్‌లు అమెజాన్ ద్వారా ప్రత్యేకంగా దేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

65-అంగుళాల, 75-అంగుళాలు, 85-అంగుళాల మోడల్‌లు రూ. 99,990, రూ. 1,59,990, రూ. 2,29,990 ప్రత్యేక ఆఫర్ల కింద కొనుగోలు చేయొచ్చు. 98-అంగుళాల మోడల్ ధర ఇంకా ఇ – కామర్స్ సైట్‌లో వెల్లడించలేదు. అయితే, కస్టమర్లు జనవరి 13 నుంచి జనవరి 20 వరకు ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్‌లను యాక్సెస్ చేయగలరని కంపెనీ తెలిపింది.

TCL C755 4K QD Mini LED TVs With Dolby Vision

TCL C755 4K QD Mini LED TVs With Dolby Vision

టీసీఎల్ సి755 మినీ ఎల్ఈడీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
టీసీఎల్ సి755 సిరీస్ 144హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో 4కె యూహెచ్‌డీ (3,840 x 2,160 పిక్సెల్‌లు) విఏ మినీ ఎల్ఈడీ ప్యానెల్‌ను కలిగి ఉంది. గరిష్ట ప్రకాశం స్థాయి 550నిట్స్, యాస్పెక్ట్ రేషియో 16:09, కాంట్రాస్ట్ రేషియో 60: 60 1 ఉంటుంది. స్క్రీన్ హెచ్‌ఎల్‌జీ, హెచ్‌డీఆర్10 ప్లస్ డాల్‌బై విజన్ ఐక్యూ టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది. స్లిమ్, యూని-బాడీ డిజైన్‌తో వస్తుంది.

ఏఐపీక్యూ ప్రాసెసర్ 3.0 ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. టీసీఎల్ సి755 ఇంటర్నల్ గూగుల్ అసిస్టెంట్‌తో గూగుల్ టీవీలో రన్ అవుతుంది. ఈ టీవీలో డ్యూయల్ 10డబ్ల్యూ ఒక 20డబ్ల్యూ స్పీకర్‌తో డాల్బీ అట్మోస్, డీటీఎస్-హెచ్‌డీ, డీటీఎస్ వర్చువల్ ఎక్స్ సపోర్ట్ ఉంది. ఈ టీవీ ఐమ్యాక్స్ మెరుగైన ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్ టీవీలో గేమ్ మాస్టర్ 2.0 అమర్చి ఉంది.

వినియోగదారుల గేమింగ్ ఎక్స్‌‌పీరియన్స్ మెరుగుపరుస్తుంది. మిరాక్యాస్ట్ వీడియో చాట్ ఫీచర్‌లకు కూడా సపోర్టు ఇస్తుంది. టీసీఎల్ సి755 హెచ్‌డీఎంఐ1.4, హెచ్‌డీఎంఐ2.0, హెచ్‌డీఎంఐ2.1 పోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టెలివిజన్ బ్లూటూత్ 5.2, వై-ఫై 6 కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. విఇఎస్ఎ వాల్ మౌంటుతో వస్తుంది.

Read Also : Lenovo Tab M11 Launch : భారీ బ్యాటరీతో లెనోవో ట్యాబ్ ఎం11 వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?