టాటా నువ్వు గ్రేట్ : TCS ఎలక్షన్ ఫండ్ రూ.220 కోట్లు

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్) ఎన్నికల ట్రస్టుకు 31.2 మిలియన్ల డాలర్లు (రూ.220 కోట్లు) విరాళంగా ఇచ్చింది.

  • Published By: sreehari ,Published On : April 13, 2019 / 09:22 AM IST
టాటా నువ్వు గ్రేట్ : TCS ఎలక్షన్ ఫండ్ రూ.220 కోట్లు

Updated On : April 13, 2019 / 9:22 AM IST

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్) ఎన్నికల ట్రస్టుకు 31.2 మిలియన్ల డాలర్లు (రూ.220 కోట్లు) విరాళంగా ఇచ్చింది.

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్) ఎన్నికల ట్రస్టుకు రూ.220 కోట్లు విరాళంగా ఇచ్చింది. జనవరి-మార్చి 2018-19 ఆర్థికసంవత్సరంలో నాల్గో క్వార్టర్ చివరిలో ఎన్నికల ట్రస్టుకు విరాళంగా అందించినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికల నిధులకు అత్యధికంగా విరాళం ఇచ్చిన ఐటీ కంపెనీలో టీసీఎస్ ఒకటిగా నిలిచింది. ఈ కంపెనీ సహకారంతో ఎన్ని పార్టీలకు ప్రయోజనం చేకూరిందని అనేదానిపై క్లారిటీ లేదు.

టీసీఎస్ సహా  టాటా గ్రూపు కంపెనీలు గతంలో కూడా ఎన్నికల ట్రస్టుకు నిధులు సమకూర్చాయి. 2013లో టాటా ట్రస్టు ఏర్పాటు చేసిన ప్రొగ్రెసివీ ఎలక్ట్రోల్ ట్రస్టుకు టీసీఎస్ నగదును విరాళంగా ఇచ్చింది. ఏప్రిల్ 1, 2013, మార్చి 31, 2016 మధ్యకాలంలో పలు రాజకీయ పార్టీలకు ఈ ట్రస్టు నుంచే నిధులు సమకూరాయి. 

ఇందులో కాంగ్రెస్ పార్టీకే అత్యధికంగా నిధులు సమకూర్చగా.. బీజేడీ పార్టీ తర్వాతి స్థానంలో నిలిచింది. ఇదే కాలంలో టీసీఎస్ రూ.1.5 కోట్లు సహకారం అందించింది. ఇండియాలో చాలా ఎన్నికల ట్రస్టులు ఉండగా.. అందులో కార్పొరేట్స్, రాజకీయ పార్టీలకు మధ్యవర్తులుగా నడుస్తున్నాయి. ఎన్నికల నిధులు అందించే ట్రస్టుల్లో ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్టు అతిపెద్ద కాంట్రిబ్యూటర్ ట్రస్టు.

అతిపెద్ద కాంట్రిబ్యూటర్ ట్రస్టుల్లో భారతీ గ్రూపు, డీఎల్ ఎఫ్ ఉన్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఫ్రడెంట్ ట్రస్టులో జనరేట్ అయిన మొత్తం నగదు రూ.169 కోట్లలో రూ.144 కోట్లు బీజేపీకి విరాళంగా వెళ్లాయి. కేంద్ర ఎన్నికల కమిషన్, టాటా కంపెనీ ప్రొగ్రెసీవ్ ఎన్నికల ట్రస్టుకు సంబంధించి లేటెస్ట్ ఆర్థిక నివేదిక ప్రకారం.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఏ రాజకీయ పార్టీకి విరాళం ఇవ్వలేదని తెలిపింది.