Tesla Cars Internet : టెస్లా కార్లలో స్టార్‌లింక్ ఇంటర్నెట్‌ కనెక్షన్.. ఇక ఫోన్లలో నేరుగా శాటిలైట్‌ సిగ్నల్స్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు!

Tesla Cars Internet : టెస్లా కార్లలో శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులో రానుంది. కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్.. రాబోయే స్టార్‌లింక్ V2 శాటిలైట్ సర్వీసు ద్వారా డెడ్ జోన్లలో మొబైల్ ఫోన్లకు ఇంటర్నెట్ కనెక్షన్ అందించనున్నట్టు ప్రకటించారు.

Tesla Cars Internet : టెస్లా కార్లలో స్టార్‌లింక్ ఇంటర్నెట్‌ కనెక్షన్.. ఇక ఫోన్లలో నేరుగా శాటిలైట్‌ సిగ్నల్స్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు!

Tesla cars will soon connect Starlink internet directly, will offer internet even when phone not working

Updated On : August 26, 2022 / 5:18 PM IST

Tesla Cars Internet : టెస్లా కార్లలో శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులో రానుంది. కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్.. రాబోయే స్టార్‌లింక్ V2 శాటిలైట్ సర్వీసు ద్వారా డెడ్ జోన్లలో మొబైల్ ఫోన్లకు ఇంటర్నెట్ కనెక్షన్ అందించనున్నట్టు ప్రకటించారు. తద్వారా టెస్లా కార్లకు స్టార్‌లింక్ ఇంటర్నెట్ కనెక్టవిటీ అందించనున్నారు. ఇకపై టెస్లా కార్లు ఈ తరహా సర్వీసును అందిస్తాయని మస్క్ ధృవీకరించారు. మీ ఫోన్ సిగ్సల్స్ అందక పని చేయనప్పుడు కూడా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చునని అన్నారు.

కానీ, ఇది ఎలా పని చేస్తుంది? కనెక్షన్‌ల నుంచి యూజర్లు ఎంత యాక్సెస్‌ను పొందగలరు అనేది మస్క్ వెల్లడించలేదు. స్టార్‌లింక్ V2 వచ్చే ఏడాది లాంచ్ అవుతుందని ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో ధృవీకరించారు. సాంప్రదాయ సర్వీసు అందుబాటులో లేని ప్రాంతాల్లో వినియోగదారులకు కనెక్షన్‌లను అందించడమే లక్ష్యంగా SpaceX T-Mobile ఇతర ఆపరేటర్‌లతో భాగస్వామ్యాన్ని అందిస్తోంది. డెడ్ జోన్లలో హై స్పీడ్ కనెక్షన్ వస్తుందని భావించరాదని నివేదికలు సూచిస్తున్నాయి.

Tesla cars will soon connect Starlink internet directly, will offer internet even when phone not working

Tesla cars will soon connect Starlink internet directly, will offer internet

శాటిలైట్ కనెక్షన్‌ని ద్వారా ఏదైనా మెసేజ్ పంపడంలో లేదా స్వీకరించడంలో కొంత ఆలస్యాన్ని యూజర్లు గమనించవచ్చు. కొంతమంది సులభంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. మెసేజ్‌లను కూడా పంపుకోవచ్చు. కానీ, వీడియో కాల్‌లు సరిగ్గా పని చేయవని గుర్తించాలి. ప్రతి సెల్ జోన్‌కు కనెక్టివిటీ 2 నుంచి 4 Mbits ఉంటుందని మస్క్ చెప్పారు. తక్కువ బ్యాండ్‌విడ్త్ కారణంగా, ప్రజలు కాలింగ్ లేదా టెక్స్టింగ్ వంటి ప్రాథమిక ఫీచర్‌లను మాత్రమే ఉపయోగించగలరు.

అసలు నెట్ వర్క్ లేదనేది కన్నా మెరుగ్గా ఉంటుంది. డెడ్ జోన్‌లలో సున్నితమైన టెక్స్టింగ్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు వాట్సాప్, imessage వంటి ప్రముఖ మెసేజింగ్ యాప్‌లు T-Mobileతో కలిసి పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. T-Mobile సర్వీసు కోసం ఎంత వసూలు చేస్తుంది అనేది క్లారిటీ లేదు. లేదంటే ఉచితంగా సర్వీసును అందిస్తుందా? లేదో తెలియాలంటే మరికొన్నిరోజులు ఆగాల్సిందే.

Read Also : Tesla Cars in India: భారత్ లో అమ్మండి, కానీ చైనా నుంచి ఇక్కడికి తీసుకురాకండి: టెస్లా కంపెనీకి కేంద్ర మంత్రి గడ్కరీ సూచన