Threads Users : మెటా థ్రెడ్స్ దెబ్బకు ట్విట్టర్ విలవిల.. అప్పుడే 80 మిలియన్ల యూజర్లను దాటేసింది.. 100 మిలియన్ మార్క్ దిశగా థ్రెడ్స్ యాప్..!

Threads App Users : మెటా థ్రెడ్స్ దెబ్బకు ట్విట్టర్ విలవిలాడుతోంది. యాప్ లాంచ్ అయిన కొద్ది గంటల్లోనే 80 మిలియన్ల యూజర్లను దాటేసింది.. 100 మిలియన్ మార్క్ దిశగా థ్రెడ్స్ యాప్ దూసుకుపోతోంది.

Threads Users : మెటా థ్రెడ్స్ దెబ్బకు ట్విట్టర్ విలవిల.. అప్పుడే 80 మిలియన్ల యూజర్లను దాటేసింది.. 100 మిలియన్ మార్క్ దిశగా థ్రెడ్స్ యాప్..!

Threads App Reaches 80 Million Users, How Many Users Are On The Threads_ Check Full Details

Updated On : July 8, 2023 / 10:27 PM IST

Threads App Users : ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ యాజమాన్యంలోని మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ ట్విట్టర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ట్విట్టర్ పోటీగా మెటా థ్రెడ్స్ అనే సరికొత్త సోషల్ యాప్ ఎవరూ ఊహించనంతగా ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. సోషల్ మీడియా హిస్టరీలోనే థ్రెడ్స్ యాప్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ రిలీజ్ చేసిన ఈ థ్రెడ్స్ యాప్.. లాంచ్ అయిన 48 గంటల్లోనే 80 మిలియన్లకు పైగా (86,190,781) యూజర్లతో దూసుకుపోయింది. ఇప్పటివరకూ ఏ సోషల్ యాప్ కూడా చేరుకోనంత యూజర్‌బేస్ అతికొద్ది సమయంలోనే చేరుకుంది. ఇది గంటల్లోనే 30 మిలియన్ల మంది కొత్త వినియోగదారులను సైన్ అప్ చేసిందని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ గురువారం కొత్త ప్లాట్‌ఫారమ్‌లో తెలిపారు.

థ్రెడ్స్ యాప్ ట్విట్టర్‌ పోలి ఉంటుంది. దాదాపు అన్ని ఫీచర్లు ఒకేలా ఉంటాయి. థ్రెడ్స్ ప్లాట్‌ఫారంలో వినియోగదారులు మెసేజ్ లను లైక్ చేయడంతో పాటు రీపోస్ట్ చేయడానికి అనుమతిస్తుంది. అయితే, థ్రెడ్స్ ప్లాట్‌ఫారమ్‌లోని యూజర్లు తమ ప్రస్తుత ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌బేస్‌ని ఫాలో అయ్యేందుకు అనుమతించడం ద్వారా ఇన్‌స్టాగ్రామ్ పాపులారిటీని మరింత పెంచుతోంది. థ్రెడ్స్ యాప్ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ ఎంత మంది వినియోగదారులను సంపాదించుకుందో ఇప్పుడు పూర్తి వివరాలను తెలుసుకుందాం..

Read Also : Threads App : థ్రెడ్స్ తడాఖా.. అత్యంత వేగంగా అగ్రస్థానం.. ఒక మిలియన్ చేరడానికి ఏయే సోషల్ యాప్‌కు ఎంతకాలం పట్టిందో తెలుసా?

థ్రెడ్ యాప్‌లో ఎంత మంది వినియోగదారులు ఉన్నారు? :
ఇన్‌స్టాగ్రామ్ ప్రారంభించిన టెక్స్ట్-ఆధారిత మెసేజింగ్ యాప్ థ్రెడ్స్.. మొదటి 48 గంటల్లోనే సైన్అప్‌లలో వేగవంతంగా దూసుకెళ్లింది. థ్రెడ్స్ యాప్‌లోని అకౌంట్ల సంఖ్య 80 మిలియన్ల (86,190,781)ను అధిగమించి అందరి అంచనాలను మించిపోయింది. అదే దూకుడుతో థ్రెడ్స్ యాప్ 100 మిలియన్ల వినియోగదారులను చేరుకునే దిశగా దూసుకుపోతోంది.

చాట్‌జీపీటీ, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ కన్నా వేగంగా :
ఇప్పటికే ఉన్న ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు థ్రెడ్స్ యాప్ కోసం సులభంగా సైన్ అప్ చేయవచ్చు. థ్రెడ్స్ లాంచ్ నుంచి యాప్‌తో యూజర్లు ఈజీగా ఎంగేజ్ అవ్వవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాప్ కనెక్టవిటీని మరింతసులభతరం చేసింది. అయితే, ఈ యాప్ ప్రస్తుతం యూరోపియన్ యూనియన్‌లో అందుబాటులో లేదు. చాట్‌జీపీటీ, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ యాప్స్ కన్నా వేగంగా తక్కువ సమయంలోనే థ్రెడ్స్ యాప్ 80 మిలియన్లకు పైగా యూజర్లను సొంతం చేసుకుంది.  

Threads App Reaches 80 Million Users, How Many Users Are On The Threads_ Check Full Details

Threads App Reaches 80 Million Users, How Many Users Are On The Threads_ Check Full Details

థ్రెడ్స్‌తో పోటీపై ట్విట్టర్ స్పందన? :
థ్రెడ్స్ యాప్ పోటీకి ట్విట్టర్ ప్రతిస్పందించింది. ఇన్‌స్టాగ్రామ్ పేరంట్ సంస్థ అయిన మెటాపై దావా వేస్తామని ఆరోపిస్తూ లేఖ పంపింది. వాణిజ్య రహస్యాలకు యాక్సస్ కలిగిన మాజీ ట్విట్టర్ ఉద్యోగులను నియమించుకున్నారని కంపెనీ ఆరోపించింది. ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్, మాజీ సీఈఓ జాక్ డోర్సే ట్విట్టర్ ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫారాలకు సంబంధించి చర్చల్లో నిమగ్నమయ్యారు.

థ్రెడ్స్ యాప్ ఎలా పొందాలి :
థ్రెడ్స్ యాప్ యాక్సెస్ పొందాలంటే.. వినియోగదారులు యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్‌లో యాప్‌ను కనుగొనవచ్చు. iOSలోని ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు సెర్చ్ బార్ ద్వారా థ్రెడ్స్ కోసం సెర్చ్ చేయొచ్చు. యాప్ స్టోర్‌కు వెళ్లి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ ప్లే స్టోర్‌ని డౌన్‌లోడ్ పేజీ, పబ్లిక్ ప్రొఫైల్‌లుగా వినియోగిస్తుంది.

థ్రెడ్స్ యాప్ Sign Up చేయాలంటే? :
థ్రెడ్స్ యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత వినియోగదారులు తమ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ నేమ్ ఉపయోగించి సైన్‌అప్ చేయవచ్చు. తమ పబ్లిక్ ప్రొఫైల్‌ ఆధారంగా (Instagram)లో ఫాలో అయ్యే అకౌంట్లను ఫాలో అయ్యేందుకు ఆప్షన్ పొందవచ్చు. థ్రెడ్స్ యాప్ ప్రారంభంలోనే సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, బ్రాండ్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో సహా వివిధ వినియోగదారులను ఆకర్షించింది.

థ్రెడ్స్ యాప్ ఎలా పనిచేస్తుంది? థ్రెడ్స్ యాప్ అధికారిక నిబంధనలు, ప్రైవసీపరమైన ఆందోళనలు తలెత్తాయి. యూజర్ ఐడెంటిటీకి థ్రెడ్స్ డేటా లింక్ చేయడంపై కొంతమంది వినియోగదారులు ప్రైవసీ వంటి సమస్యలను లేవనెత్తారు. జాక్ డోర్సేతో సహా యాప్ ప్రైవసీ నిరాకరణపై విమర్శలు వెల్లువెత్తాయి. వినియోగదారులు తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డియాక్టివేట్ చేయడం ద్వారా తమ థ్రెడ్స్ అకౌంట్ /ప్రొఫైల్‌ను డియాక్టివేట్ చేయడం లేదా డిలీట్ చేయగలరని గమనించాలి.

Read Also : Threads War : మెటా ‘థ్రెడ్’ మార్క్‌పై మస్క్ మామకు కోపమొచ్చింది.. మేం తొలగించిన వాళ్లను అందుకే పెట్టుకున్నారు.. తగ్గేదే లే.. దావా వేసి తీరుతాం..!