కొత్త ఫోన్ కొంటున్నారా? : రూ.10వే లోపు.. Top 3 బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే 

ఇండియా మార్కెట్లో ఎన్నో కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. అన్ని స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా వినిపించేది స్మార్ట్ టాక్.. కెమెరా ఫీచర్లు. యూజర్లను కట్టిపడేసే హై క్వాలిటీ లెన్స్ కెమెరాలకు ఫుల్ క్రేజ్ ఉంది.

  • Published By: sreehari ,Published On : August 22, 2019 / 07:55 AM IST
కొత్త ఫోన్ కొంటున్నారా? :  రూ.10వే లోపు.. Top 3 బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే 

Updated On : May 28, 2020 / 3:43 PM IST

ఇండియా మార్కెట్లో ఎన్నో కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. అన్ని స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా వినిపించేది స్మార్ట్ టాక్.. కెమెరా ఫీచర్లు. యూజర్లను కట్టిపడేసే హై క్వాలిటీ లెన్స్ కెమెరాలకు ఫుల్ క్రేజ్ ఉంది.

ఇండియా మార్కెట్లో ఎన్నో కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. అన్ని స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా వినిపించేది స్మార్ట్ టాక్.. కెమెరా ఫీచర్లు. యూజర్లను కట్టిపడేసే హై క్వాలిటీ లెన్స్ కెమెరాలకు ఫుల్ క్రేజ్ ఉంది. ప్రతి స్మార్ట్ ఫోన్ మేకర్ యూజర్లను ఆకట్టుకునేందుకు అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాయి.

కొత్త స్మార్ట్ ఫోన్ ఎవరూ కొన్నా ముందుగా చూసేది కెమెరా ఫీచర్లు… ఆ తర్వాత ర్యామ్ ఎంత? స్టోరేజీ ఎంత ఉంది? తమ బడ్జెట్ తగినట్టుగా ధర ఉందా? అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటారు. నచ్చితే వెంటనే కొనేస్తారు. కొంతమంది ధరతో సంబంధం లేకుండా ఎట్రాక్టీవ్ ఫీచర్లు ఉంటే చాలు.. ఎగబడి కొనేస్తుంటారు.
Read Also : కాలాంతకులు : వెయ్యి రూపాయల సాఫ్ట్‌వేర్ తో వాట్సాప్‌ కే బురిడీ!

ఆన్ లైన్, ఆఫ్ లైన్ మార్కెట్లో ఎప్పటికప్పుడూ కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతుండటంతో చాలామందికి ఏ స్మార్ట్ ఫోన్ కొంటే బెటర్.. ఏది బాగుంటుంది. ఎందులో ఫీచర్లు బాగుంటాయి.. ఫోన్ పర్ఫామెన్స్ స్పీడ్ ఉంటుందా ఉండదా.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు ఏమైనా ఉన్నాయా? ఇలా ఎన్నో సందేహలు ఉంటాయి.

సరైన గైడెన్స్ లేకపోవడంతో ఏ ఫోన్ కొనాలో తెలియక హైరానా పడుతుంటారు. మీలాంటి వారి కోసం మార్కెట్లో రూ.10వేల లోపు లభ్యమయ్యే టాప్ 3 బెస్ట్ స్మార్ట్ ఫోన్ల వివరాలను సేకరించి అందిస్తున్నాం. వీటిలో తక్కువ ధరకు మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ సెలెక్ట్ చేసుకుని వెంటనే కొనేసుకోండి. 

1. Xiaomi Redmi Y3 : 
షియోమీ కంపెనీ బ్రాండ్ రెడ్ మి నుంచి మార్కెట్లోకి వచ్చింది Redmi Y3. హైయర్ రెజుల్యూషన్ 32సెల్ఫీ కెమెరాతో సెల్ఫీ సెంట్రిక్ ఫోన్ ఇదొకటి. డ్యుయల్ రియర్ కెమెరా (బ్యాక్) ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ప్రాసెసర్ ఆక్టా.. సిస్టమ్ ఆన్ చిప్.. స్నాప్ డ్రాగన్ 632 Soc గేమింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. రెడ్ మి నోట్ 7తో పోలిస్తే Redmi Y3 సెల్ఫీ కెమెరా బెటర్ గా ఉంటుంది.

డిజైన్ చూస్తే.. రెడ్ మి నోట్ సిరీస్ మాదిరిగా ఎట్రాక్టీవ్ ఉంటుంది. కర్వడ్ బ్యాక్, ప్లాస్టిక్ బాడీ కూడా ఉంది. పబ్‌జీ వంటి ఆన్ లైన్ గేమ్స్ ఆడేందుకు గేమింగ్ టెక్నాలజీ కలిగిన బడ్జెట్ ఫోన్లలో ఇదొకటి బెస్ట్ ఫోన్ చెప్పవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో దీని ధర రూ.8వేల 999తో అందుబాటులో ఉంది. 

స్పెషిఫికేషన్లు – ఫీచర్లు : 
* స్ర్కీన్ సైజు : 6.26 అంగుళాలు (1520×720 ) ఫిక్సల్స్
* రియర్ కెమెరా : డ్యుయల్ రియర్ కెమెరాలు 12+2 | 32MP
* మెమెరీ : 3GB ర్యామ్ /32GB స్టోరేజీ
* 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ
* బ్యాటరీ : 4000mAh
* ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 
* Soc : స్నాప్ డ్రాగన్ 632 
* ప్రాసెసర్ : ఆక్టా 

2. Realme 3  : 
ఒప్పో సబ్ బ్రాండ్ నుంచి వచ్చిన రియల్ మి 3 సాధారణ బడ్జెట్ ఫోన్ల మాదిరిగా ఉండదు. ప్రీమియం డిజైన్‌తో రిలీజ్ అయింది. ఇందులో మీడియా టెక్ హెలియా P70 Soc చిప్ సెట్ ఉంది. బ్యాక్ సైడ్ డ్యుయల్ కెమెరా సెటప్ తో పోర్టరైట్ మోడ్ తో ఆఫర్ చేస్తోంది. బెజిల్ లెస్ డిస్ ప్లే మాదిరిగా వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉంది. SD కార్డు కోసం ట్రిపుల్ స్లాట్ ప్రత్యేకం.

ప్లాస్టిక్ బాడీతో ప్రీమియం డిజైన్ సరికొత్తగా ఉంటుంది. ప్లేయింగ్ గేమ్స్, వీడియోలు చూసేందుకు ఎంతో బెటర్. బెస్ట్ బడ్జెట్ ఫోన్లలో రియల్ మి 3 కెమెరా స్పెషల్ ఎట్రాక్షన్. డైనమిక్ బ్లూ, రెడియంట్, క్లాసిక్ బ్లాక్ మూడు కలర్లలో లభ్యం అవుతోంది. ప్రస్తుతం అమెజాన్‌లో దీని ధర రూ.8వేల 999తో అందుబాటులో ఉంది. 

స్సెషిఫికేషన్లు – ఫీచర్లు ఇవే :
* స్ర్కీన్ సైజు : 6.22 అంగుళాలు (720×1520)
* కెమెరా : 13 +2 |13 MP సెకండరీ సెన్సార్
* ర్యామ్ : 4 GB + 3GB
* స్టోరేజీ : 32GB + 64GB 
* బ్యాటరీ : 4230mAh
* ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్
* Soc : Mediatek P70 

3. శాంసంగ్ గెలాక్సీ M10 :
శాంసంగ్ గెలాక్సీ M10 స్మార్ట్ ఫోన్ లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. రూ.10వేల సిగ్మంట్ ఫోన్లలో ఇదో బెస్ట్ ఫోన్ కూడా. ప్రైమరీ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. స్ర్కీన్ ఫీచర్ బాగుంది. ఎలాంటి స్ర్కాచ్ పడకుండా వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. మార్కెట్లో ఇతర ఫోన్ల ధరతో పోలిస్తే గెలాక్సీ ఎం10 ఒక యూనిక్ డివైజ్.. ధర తక్కువ.. మంచి ఫీచర్లు ఉన్నాయి.

చిప్ సెట్ పాతదే అయినా పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్. బ్యాటరీ సామర్థ్యం బాగుంది. డీసెంట్ కెమెరాలు స్పెషల్ ఎట్రాక్షన్. సోషల్ మీడియా యాప్స్ వాడేవారికి బాగా నచ్చుతుంది. క్యాజువల్ గేమ్స్ ఆడేందుకు అనువుగా ఉండేలా రూపొందించారు. ప్రస్తుతం అమెజాన్‌లో దీని ధర రూ.7వేల 990కే అందుబాటులో ఉంది. 

స్పెషిఫికేషన్లు – ఫీచర్లు ఇవే :
* స్ర్కీన్ సైజు : 6.2 అంగుళాలు (720×1520)
* కెమెరా : 13 +|5 MP సెకండరీ సెన్సార్
* ర్యామ్ : 2 GB + 3GB
* స్టోరేజీ : 16GB + 32GB 
* బ్యాటరీ : 3400mAh
* ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్
* Soc : Exynos 7870
* ప్రాసెసర్ : 1.6GHz octa-core
* 5W charger సపోర్ట్ 
* 3.5mm హెడ్ ఫోన్ socket