Top 5 Upcoming Cars 2023 : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? 2023లో టాప్ 5 అప్‌కమింగ్ కార్లు ఇవే.. ఏ కారు మోడల్ ధర ఎంత ఉండొచ్చుంటే?
Top 5 Upcoming Cars 2023 : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? 2023 ఏడాదిలో భారత మార్కెట్లోకి కొత్త కారు మోడల్స్ రాబోతున్నాయి. ప్యాసింజర్ వెహికల్ (PV) సెగ్మెంట్లో అనేక కొత్త మోడల్ కార్లు లాంచ్ కానున్నాయి.

Top 5 upcoming launches : 2023 Hyundai Verna And Honda City facelift, Maruti Suzuki Jimny, Maruti Suzuki Fronx, Toyota Innova Crysta
Top 5 Upcoming Cars 2023 : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? 2023 ఏడాదిలో భారత మార్కెట్లోకి కొత్త కారు మోడల్స్ రాబోతున్నాయి. ప్యాసింజర్ వెహికల్ (PV) సెగ్మెంట్లో అనేక కొత్త మోడల్ కార్లు లాంచ్ కానున్నాయి. గత కొన్ని నెలలుగా మార్కెట్లో అనేక కొత్త కారు మోడల్‌లు వస్తున్నాయి. మున్ముందు మరిన్ని లేటెస్ట్ కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆటోమొబైల్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. రాబోయే వారాల్లో సెడాన్లు, స్పోర్ట్ యుటిలిటీ వాహనాలు (SUV), మల్టీ బెనిఫిట్స్ వాహనాలు (MPVలు) భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. రాబోయే టాప్ 5 అప్‌కమింగ్ కార్లలో మొదటి 5 ఆప్షన్లను మీకోసం అందిస్తున్నాం.. మీకు నచ్చిన కారు మోడల్ ఏంటి? భారత మార్కెట్లో ఏయే కారు మోడల్ ధర ఎంత ఉండొచ్చు అనేది వివరంగా తెలుసుకుందాం..
2023 హ్యుందాయ్ వెర్నా (2023 Hyundai Verna) :
భారత మార్కెట్లో 2023 హ్యుందాయ్ వెర్నా లాంచ్ మార్చి 21న జరుగనుంది. మిడ్-సైజ్ సెడాన్ 6వ జనరేషన్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ మోడల్ కారు ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 17 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని భావిస్తున్నాము. ఇందులో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5-లీటర్ MPi పెట్రోల్, 1.5-లీటర్ టర్బో GDi పెట్రోల్, మరో కొన్ని ఆప్షన్లలో 6-స్పీడ్ MT, IVT ఆటోమేటిక్, 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ ఉండనున్నాయి. కొత్త హ్యుందాయ్ వెర్నా 14 వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.

Top 5 upcoming launches : 2023 Hyundai Verna
2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ (2023 Honda City facelift) :
అత్యంత పాపులర్, ఐకానిక్ మిడ్-సైజ్ సెడాన్ ఫేస్‌లిఫ్ట్ కారు త్వరలో భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ హోండా సిటీ భారత్‌లో 5వ జనరేషన్ అవతార్‌లో అమ్మకానికి వచ్చింది. జూలై 2020లో ఈ కారు మోడల్ లాంచ్ అయింది. 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వచ్చే నెలలో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. 2023 సిటీ 6-స్పీడ్ MT, CVT ఆటోమేటిక్ ఆప్షన్లతో 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్‌ను మాత్రమే అందిస్తుంది. ఈ ఆఫర్లో డీజిల్ ఇంజిన్ ఉండదు. దీని ధర రూ. 11 లక్షల నుంచి రూ. 16 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Top 5 upcoming launches : 2023 Honda City facelif
మారుతీ సుజుకి జిమ్నీ(Maruti Suzuki Jimny) :
ఐదు డోర్లతో మారుతి సుజుకి జిమ్నీ జనవరి 12న ఆటో ఎక్స్పో 2023లో ప్రదర్శించారు. అదే రోజున SUV బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. జిమ్నీ K15B 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (105PS/134Nm)ని వినియోగిస్తుంది. దీనిని 5-స్పీడ్ MT లేదా 4-స్పీడ్ ATతో కలపవచ్చు. SUV లో రేంజ్ ట్రాన్స్ఫర్ గేర్ (4L మోడ్) ప్రమాణంగా ALLGRIP PRO 4WD టెక్నాలజీతో రానుంది. జిమ్నీ జీటా, ఆల్ఫా వేరియంట్లలో అందించనుంది. SUV ధర రూ. 9 లక్షల నుంచి రూ. 13 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా.

Top 5 upcoming launches : 2023 Maruti Suzuki Jimny
మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) :
మారుతి సుజుకి ఫ్రాంక్స్ జనవరి 12న జిమ్నీతో పాటు ఆటో ఎక్స్పో 2023లో ప్రత్యక్షమైంది. అదే రోజున ఈ కారు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. K12N 1.2-లీటర్ పెట్రోల్ (90PS/113Nm), K10C 1.0-లీటర్ టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ (100PS/148Nm) ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ MT, 5-స్పీడ్ AMT, 6-స్పీడ్ AT ఉన్నాయి. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధర రూ. 6.50 లక్షల నుంచి ప్రారంభమై రూ. 11 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు వెళ్లవచ్చు. ఈ కారు సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా వంటి 5 వేరియంట్లలో రానుంది.

Top 5 upcoming launches : 2023 Maruti Suzuki Fronx
టయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta) :
ఈ ఏడాది జనవరిలో టయోటా ఇన్నోవా క్రిస్టా ధర రూ. 50వేల టోకెన్ మొత్తానికి బుకింగ్‌లను ప్రారంభించింది. ఇన్నోవా క్రిస్టా కేవలం 5-స్పీడ్ MTతో 2.4-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను మాత్రమే పొందుతుంది. ఇన్నోవా క్రిస్టా డీజిల్ G, GX, VX, ZX వంటి నాలుగు వేరియంట్లను కలిగి ఉంది. అంతేకాదు.. 7-సీటర్, 8-సీటర్ కాన్ఫిగరేషన్లు కూడా ఉన్నాయి. ఈ మోడల్ కారు ధర రేంజ్ రూ. 17 లక్షల నుంచి రూ. 25 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు.

Top 5 upcoming launches : 2023 Toyota Innova Crysta