ఊబర్ CTO రాజీనామా…భారీగా ఉద్యోగాల కోత

  • Published By: venkaiahnaidu ,Published On : April 29, 2020 / 08:15 AM IST
ఊబర్ CTO  రాజీనామా…భారీగా ఉద్యోగాల కోత

Updated On : April 29, 2020 / 8:15 AM IST

కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో ప్రపంచ వ్యాప్తంగా రవాణావ్యవస్థ సంభించిపోయిన విషయం తెలిసిందే. ప్రముఖ క్యాబ్ సర్వీసింగ్ సంస్థ ఊబర్ కూడా తీవ్రంగా నష్టపోయిన ఈ సమయంలో…7ఏళ్లుగా ఊబర్ లో సేవలందిస్తున్న ఫామ్ తన CTOపదవి నుంచి వైదొలిగారు. మరోవైపు 20శాతం మంది ఉద్యోగాలను తీసేసే విషయాన్నిఊబర్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఊబర్ ప్రతినిధి ఉద్యోగాల తొలగింపుపై కామెంట్ చేసేందుకు నిరాకరించారు. కంపెనీకి పర్మినెంట్ CTO దొరికేంతవరకు ఊబర్ ఇంజనీరింగ్ టీమ్ సభ్యులు ఫామ్ విధులు నిర్వహిస్తారని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం కొత్త CTOకోసం వెతకడం ప్రారంభించినట్లు తెలిపారు.

ఫామ్… హ్యూలెట్ ప్యాకర్డ్‌లో మూడేళ్లపాటు, తరువాత సిలికాన్ గ్రాఫిక్స్లో పనిచేశాడు. అతను ఇంటర్నెట్ యాడ్ సర్వీసింగ్ స్టార్టప్ నెట్‌గ్రావిటీలో నాల్గవ ఇంజనీర్. 1999 లో నెట్‌గ్రావిటీని కొనుగోలు చేసిన తరువాత డబుల్ క్లిక్‌లో చేరాడు ఫామ్. ఆ తర్వాత VM వేర్ లో ఎనిమిదేళ్లు పనిచేశాడు. 2013లో అతను వ్యక్తిగతంగా ఉబెర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) గా CEO ట్రావిస్ కలనిక్ చేత నియమించబడ్డాడు .రెండు వారాలలో 30 గంటల ఇంటర్వ్యూ చేసిన తరువాత అతని సాంకేతిక నైపుణ్యాలతో ఆకట్టుకోవడంతో ఊబర్ సీఈవో..ఫామ్ ను సీటీవోగా నియమించాడు.

 2016లో కంపెనీ ఉద్యోగులకు పంపిన అంతర్గత ఈమెయిల్ లో ఫామ్… ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక విధానంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికపై మాట్లాడుతూ…నేను ఈ దుర్మార్గపు వ్యక్తి పేరును కూడా నా నాయకుడిగా అంగీకరించను అని వ్యాఖ్యానించిన ఇమెయిల్ విస్తృతంగా ప్రచారం పొందిన విషయం తెలిసిందే.