ధర ఎంతంటే? : ఇండియాలో Vivo S1Pro వచ్చేసింది

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ ViVo నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఇండియన్ మార్కెట్లో శుక్రవారం (జనవరి 3, 2020) కంపెనీ రిలీజ్ చేసింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ S సిరీస్‌లో ఇది రెండోది. 2019 ఆగస్టులోనే Vivo S1 తొలి మోడల్ స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టింది.
తాజాగా వివో తీసుకొచ్చిన ఈ కొత్త స్మార్ట్ ఫోన్ Vivo S1Pro ధర మార్కెట్లలో రూ.19వేల 990గా నిర్ణయించింది. ఇది మొత్తం మైస్టిక్ బ్లాక్, జాజీ బ్లూ, డ్రీమీ వైట్.. మూడు కలర్లలో లభ్యం అవుతోంది. జనవరి 4 నుంచి ఈ ViVo S1Pro ఆఫ్ లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది.
10 శాతం Cash Back ఆఫర్ :
వివో E-Store నుంచి ఈ కామర్స్ వెబ్ సైట్లలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ నుంచి కూడా మోడల్ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. మీరు ఒకవేళ స్మార్ట్ ఫోన్ ఆఫ్ లైన్ కొనుగోలు చేస్తే.. ICCI బ్యాంకు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులపై 10 శాతం క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. అంతేకాదు.. వన్ టైమ్ స్ర్కీన్ రిప్లేస్ మెంట్ కూడా పొందవచ్చు.
ఇక ఆన్‌లైన్ ద్వారా వన్ టైమ్ స్ర్కీన్ రీప్లేస్ మెంట్ (జనవరి 31 వరకు ) వ్యాలీడ్ ఉంటుంది. ICICI బ్యాంకు క్రెడిట్ కార్డు EMIపై 10 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఇక జియో రూ.12వేల విలువైన ఆఫర్లు (జనవరి 31 వరకు వ్యాలీడ్) పొందవచ్చు. అలాగే 9 నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్షన్ పొందవచ్చు.
డిజైన్ + స్పెషిఫికేషన్లు ఇవే :
* డైమండ్ షేప్ కెమెరా మాడ్యుల్ (బ్యాక్)
* 6.38 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే
* 90 శాతం స్ర్కీన్ బాడీ రేషియో, FHD+ రెజుల్యుషన్
* Always on Display ఆప్షన్
* Schott Xensation 3D display protection
* ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ఫ్రింట్ స్కానర్
* 4 కెమెరా సెటప్, డైమండ్ షేప్ డ్ మాడ్యుల్
* 48MP ప్రైమరీ షూటర్, 8 MP వైడ్ యాంగిల్ లెన్స్
* 2MP కెమెరా (మైక్రో షాట్స్), 2MP (బోకే)
* ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టేబిలైజేషన్ EIS
* 32 సెల్ఫీ కెమెరా (ఫ్రంట్) డిస్ క్రిటె వాటర్ డ్రాప్ నాచ్
* 8GB/128GB ( ఒక మెమెరీ వేరియంట్ మాత్రమే)
* Qualcomm Snapdragon 665 ప్రాసెసర్
* 4,500mAh బ్యాటరీ, 18W డ్యుయల్-ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్