Vodafone Idea Outage : వోడాఫోన్-ఐడియా నెట్‌వర్క్ క్రాష్.. స్తంభించిన సర్వీసులు.. యూజర్ల ఫిర్యాదులతో Vi అధికారిక ప్రకటన..!
Vodafone Idea Outage : వొడాఫోన్-ఐడియా నెట్‌వర్క్ స్తంభించింది. టెక్నికల్ ఇష్యూ కారణంగా ఇంటర్నెట్ సర్వీసు పూర్తిగా నిలిచిపోయింది. నెట్‌వర్క్‌లోని సమస్యలను ఫిక్స్ చేశామని కంపెనీ వెల్లడించింది.

Vodafone Idea Outage
Vodafone Idea Outage : వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. అర్ధరాత్రి నుంచి ఒక్కసారిగా వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కొంటోంది. ఇంటర్నెట్ నుంచి కాల్ డ్రాప్ వరకు వినియోగదారులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు.
కొంతమంది వినియోగదారుల మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయని ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి వినియోగదారులు నెట్‌వర్క్‌లోని సమస్యలపై సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు.
ప్రత్యేకించి ఢిల్లీలోని NCR వినియోగదారులు మాత్రమే అర్థరాత్రి వరకు 1900కి పైగా ఫిర్యాదులు చేశారు. అయితే, ఇప్పుడు ఈ విషయంలో వోడాఫోన్-ఐడియా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. నెట్‌వర్క్‌లోని టెక్నికల్ ఇష్యూ కారణంగా తలెత్తిందని, ప్రస్తుతం ఆ సమస్యను పరిష్కరించామని తెలిపింది.
సోషల్ మీడియాలో యూజర్ల ఫిర్యాదులు :
డౌన్ డిటెక్టర్ నివేదిక ప్రకారం.. అత్యధిక నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కొన్న నగరాల్లో న్యూఢిల్లీ, ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్, పూణే ఉన్నాయి. నెట్‌వర్క్ క్రాష్ తర్వాత ఒకవైపు యూజర్లు ఫిర్యాదులు చేయగా, మరోవైపు సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి.
వినియోగదారులు ఎక్స్ వేదికగా ఈ సమస్యపై ఫిర్యాదు చేస్తున్నారు. కొందరు యూజర్లు వోడాఫోన్ ఐడియా నుంచి మరో నెట్‌వర్క్ పోర్ట్ చేస్తామని అంటున్నారు. వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ సమస్య ఖరీదైన ప్లాన్‌లతో అందిస్తోంది. దీని కారణంగా, వోడాఫోన్ ఐడియా యూజర్లు కూడా వేగంగా తగ్గారు.
గత ఏడాదిలో ట్రాయ్ కొత్త నివేదిక ప్రకారం.. కంపెనీ వినియోగదారులు మళ్లీ లక్షలాది మంది తగ్గారు. ఆ తరువాత కంపెనీ కొన్ని చౌకైన ప్లాన్లను ప్రారంభించింది. నెట్‌వర్క్ సమస్యను మెరుగుపరిచేందుకు కూడా అనేక ప్రయత్నాలు చేస్తోంది.
వోడాఫోన్ ఐడియా అధికారిక ప్రకటన :
యూజర్ల నుంచి ఫిర్యాదుల వెల్లువెత్తిన నేపథ్యంలో ఇప్పుడు వోడాఫోన్ ఐడియా నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. శుక్రవారం (ఏప్రిల్ 18) ఉదయం సాంకేతిక సమస్య కారణంగా ఢిల్లీలోని NCRలో మా నెట్‌వర్క్ సర్వీసులు కొంత సమయం ప్రభావితమయ్యాయి.
ప్రస్తుతం ఈ సమస్య పరిష్కరించాం. అన్ని సర్వీసులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఈ సమస్య వల్ల కలిగే ఏదైనా అసౌకర్యానికి మేం హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం” అని ప్రకటనలో పేర్కొంది.