Berkshire Hathaway : పేటీఎం నుంచి వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్వే నిష్ర్కమణ.. రూ. 630 కోట్ల నష్టం!
Berkshire Hathaway : వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్వే బీహెచ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ డిజిటల్ పేమెంట్ల సంస్థ 1.56 కోట్ల షేర్లను విక్రయించింది. ఒక్కో షేరు సగటు ధర రూ. 877.29తో ఎక్స్ఛేంజ్ డేటాను సూచించింది.

Warren Buffett’s Berkshire Hathaway exits Paytm, books loss of Rs 630 cr_ Report
Berkshire Hathaway : ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎం (వన్97 కమ్యూనికేషన్స్) నుంచి వారెన్ బఫెట్ ఆధ్వర్యంలోని బెర్క్‌షైర్ హాత్వే నిష్క్రమించింది. ఫిన్‌టెక్ మేజర్ పేటీఎంలో తన మొత్తం వాటాను సుమారు రూ. 1,370 కోట్లకు బహిరంగ మార్కెట్ ద్వారా విక్రయించింది. దాంతో రూ. 630 కోట్ల నష్టాన్ని నమోదు చేసినట్టు శుక్రవారం ఒక నివేదిక తెలిపింది. బెర్క్‌షైర్ హాత్‌వే ఇంక్ 1.56 కోట్లకు పైగా పేటీఎం షేర్లను బల్క్ డీల్‌లో విక్రయించింది. ఒక్కో షేరుకు సగటు ధర రూ. 877.29తో విక్రయించినట్టు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా తెలిపింది
ప్రపంచంలోని అతిపెద్ద బిలియనీర్ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ పేటీఎం పేరంట్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్‌లో తన మొత్తం వాటాను విక్రయించింది. వారెన్ బఫెట్ కంపెనీ బెర్క్‌షైర్ హాత్వే ఐదేళ్ల క్రితం 2018లో పేటీఎంలో రూ.2200 కోట్లు పెట్టుబడి పెట్టింది. దీని ద్వారా బఫెట్ పేటీఎంలో 2.6శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ డీల్ జరిగినప్పుడు, ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం విలువ 10 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. అయినప్పటికీ, పేటీఎంపై వారెన్ బఫెట్‌కు నష్టాన్ని కలిగించే ఒప్పందంగా మారింది. ఫలితంగా నష్టం రూ. 630 కోట్లుగా నమోదైంది.
Read Also : Whatsapp Chat Backup : మీ వాట్సాప్ చాట్ స్టోరేజీకి పేమెంట్ చేయడం లేదా? వెంటనే ఈ సెట్టింగ్‌ని మార్చండి!
సెప్టెంబర్ 2023 నాటికి, ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం.. విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని పేటీఎం వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌లో బెర్క్‌షైర్ బీహెచ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ 2.46శాతం వాటాను కలిగి ఉంది. బెర్క్‌షైర్ హాత్వే తన పెట్టుబడి పెట్టిన 5ఏళ్ల తర్వాత పేటీఎం నుంచి నిష్క్రమించింది. 2021లో పేటీఎంలో మెగా ఐపీఓ సందర్భంగా రూ. 220 కోట్ల విలువైన షేర్లను విక్రయించినట్లు నివేదిక శుక్రవారం నివేదించింది.
ఐపీఓలో కూడా వాటా విక్రయం :
పేటీఎం వన్ 97 కమ్యూనికేషన్స్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ప్రకారం.. బెర్క్‌షైర్ కంపెనీ 17,027,130 షేర్లను కొనుగోలు చేసింది. సగటు కొనుగోలు ఖర్చు ఒక్కో షేరుకు రూ. 1,279.70గా నమోదైంది. దీని తరువాత, బెర్క్‌షైర్ 2021 సంవత్సరంలో వన్97 కమ్యూనికేషన్స్ ఐపీఓ తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించింది. ఇప్పుడు బెర్క్‌షైర్ హాత్వే, అసోసియేట్ బీహెచ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ద్వారా పేటీఎంలోని 15,623,529 షేర్లను ఒక్కో షేరుకు రూ. 877.2 చొప్పున విక్రయించింది.

Warren Buffett’s Berkshire Hathaway exits Paytm
బైబ్యాక్ తర్వాత పెరిగిన షేర్ల సంఖ్య :
ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్97 కమ్యూనికేషన్స్ షేర్ బైబ్యాక్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో, కంపెనీ సగటున ఒక్కో షేరు ధర రూ.546 చొప్పున 1.55 కోట్లకు పైగా షేర్లను కొనుగోలు చేసింది. దాదాపు రూ.850 కోట్లతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ బైబ్యాక్ నుంచి పేటీఎం షేర్లు 68శాతం పెరిగాయి. అక్టోబర్ 20న 21 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది.
షేర్లు పతనం, నష్టాల్లో ఇన్వెస్టర్లు :
ఇదిలా ఉండగా, శుక్రవారం పేటీఎం షేర్లు 3 శాతానికి పైగా పడిపోయాయి. వారం చివరి ట్రేడింగ్ రోజున షేరు 3.23 శాతం నష్టంతో రూ.893 వద్ద ముగిసింది. 2021 సంవత్సరంలో కంపెనీ ఐపీఓలోకి వచ్చింది. ఈ ఐపీఓ ఇష్యూ ధర రూ. 2150గా ఉంది. లిస్టింగ్ తర్వాత కంపెనీ షేర్లు ఇష్యూ ధరకు దగ్గరగా కూడా వెళ్లలేకపోయాయి. బెర్క్ షైర్ యజమాని బఫెట్ మాత్రమే కాదు. ఐపీఓపై బెట్టింగ్ కాస్తున్న ఇన్వెస్టర్లు కూడా భారీ నష్టాలను చవిచూశారు.