ఎల్ఐసీ ఐపీఓ : పాలసీదారులకు లాభమా? నష్టమా?

దేశ ప్రజల జీవితంలో ఒక భాగమైన భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)పై మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం

  • Published By: veegamteam ,Published On : February 3, 2020 / 08:24 AM IST
ఎల్ఐసీ ఐపీఓ : పాలసీదారులకు లాభమా? నష్టమా?

Updated On : February 3, 2020 / 8:24 AM IST

దేశ ప్రజల జీవితంలో ఒక భాగమైన భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)పై మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం

దేశ ప్రజల జీవితంలో ఒక భాగమైన భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)పై మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలకు పెద్ద దిక్కులా ఉన్న ఎల్‌ఐసీ వాటాల విక్రయానికి నిర్ణయించింది. మార్కెట్ వర్గాలకు ఇది గొప్ప బూస్ట్ ఇచ్చే వార్త అయినా.. ఉద్యోగ సంఘాలకు మాత్రం చేదు వార్త అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్కెట్ లో లిస్ట్ అయితే భారీ కంపెనీగా అవతరించే అవకాశాలు ఎల్‌ఐసీకి పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.

త్వరలో స్టాక్ మార్కెట్లో ఎల్‌ఐసీ లిస్టింగ్ చేయనున్నట్లు శనివారం (ఫిబ్రవరి 1,2020) లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఇది ఏయే వర్గాలకు ఎలా లాభం? ప్రతికూలతలేమిటి? మోడీ సర్కార్ ఎలాంటి అడుగులు వేయబోతోంది? అన్నది ఆసక్తికరంగా మారింది. డిజ్‌ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ పేరుతో వివిధ సంస్థల్లో ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టేందుకు మోడీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

lic

బడ్జెట్ 2020లో కేంద్ర మంత్రి ప్రకటన తర్వాత.. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ఐపీఓకు సిద్ధమవుతోంది. ఈ ఇష్యూ వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) ద్వితీయార్ధంలో (సెప్టెంబర్ తర్వాత) ఉండే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ సూచనప్రాయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఎల్‌ఐసీ ఈక్విటీలో ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉంది. ఇందులో 5 నుంచి 10 శాతం వరకు ఐపీఓ ద్వారా విక్రయించే అవకాశం ఉందని కుమార్‌ చెప్పారు.

అయితే ఎంత శాతం ఈక్విటీ వాటా విక్రయించాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ లోపు ఐపీఓకు అవసరమైన విధి విధానాలనూ పూర్తి చేస్త్నుట్టు తెలిపారు. ఇందుకోసం చట్టాన్ని కూడా సవరించాల్సి ఉంటుందన్నారు. చట్టపరంగా ఇందుకోసం అనుసరించాల్సిన విధివిధానాలపై న్యాయ మంత్రిత్వ శాఖతో ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్టు కుమార్‌ చెప్పారు.

ఎల్ఐసీ లిస్టింగ్ కు సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు ఆనందం వ్యక్తం చేస్తే.. కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది గుడ్ న్యూస్ అని ఒకరంటే.. బ్యాడ్ న్యూస్ అని మరొకరు అంటున్నారు. ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాలసీదారుల్లో గందరగోళం నెలకొంది. అనుమానాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

lic2

ఎల్ఐసీ లిస్టింగ్ తో పాలసీదారులకు లాభాలు:
* పాలసీదారులకు సానుకూల చర్య అవుతుంది. అయితే ప్రయోజనం పరోక్షంగా ఉంటుంది. 
* సాంప్రదాయ పాలసీల కోసం పెట్టుబడి రాబడి.. బీమా పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఇటువంటి ప్రణాళికలు LIC పుస్తకంలో పెద్ద భాగాన్ని ఏర్పరుస్తాయి. 
* LIC పాలన పర్యవేక్షించడానికి విశ్లేషకులను అనుమతిస్తుంది.
* ఎల్ఐసి సెబి ప్రత్యక్ష పరిశీలనలో వస్తుంది.

* ఇతర లిస్టెడ్ సంస్థలకు ఉద్దేశించిన అవసరాలకు అనుగుణంగా ఉండాలి.  * కార్పొరేట్ పాలన, ఆర్థిక, పెట్టుబడి క్రమశిక్షణను బలోపేతం చేసే అవకాశం ఉంది. 
* పాలసీదారులకు అధిక రాబడి వస్తుంది.
* లిస్టింగ్ కు వెళ్లే ఏ కంపెనీ అయినా వాటాదారులకు శుభవార్తే.

* పారదర్శకత పెరుగుతుంది. మెరుగైన పాలన ఉంటుంది. పెట్టుబడిదారుల నుండి పరిశీలన ఉంటుంది.
* ఎల్‌ఐసి ఒక సాధారణ సంస్థ కాదు. ఎల్‌ఐసి గతంలో ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టింది. 
* ఎల్ఐసి పబ్లిక్ వాటాదారులకు జవాబుదారీగా ఉంటుంది.
* తెలివైన పెట్టుబడి నిర్ణయం అవుతుంది.

* ఇది పాలసీదారులకు మంచిది. 
* ఎల్‌ఐసి కూడా మరింత పోటీగా మారుతుంది. 
* ఇది ధర, ఉత్పత్తి లక్షణాలు, సేవల పరంగా పాలసీదారులకు ప్రయోజనం చేకూరుతుంది.

* LIC ఆర్థిక ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది.
* LIC ఆస్తి నిర్వహణ నాణ్యత మెరుగవుతుంది.
* ఎల్ఐసీ ఆస్తి నిర్వహణపై ప్రభుత్వ ప్రభావం తగ్గుతుంది.
* వాణిజ్య రంగంలో పూచీకత్తు సవాళ్లను కలిగి ఉన్న కొన్ని రాష్ట్ర-ప్రాయోజిత పథకాలకు LIC సేవలు అందిస్తుంది. 
* IPO తో ఈ సేవలు అమలులోకి వస్తాయి.

* LIC స్థిరత్వాన్ని మెరుగవుతుంది.
* ఒక్కమాటలో చెప్పాలంటే, తక్కువ సమాఖ్య జోక్యంతో, ఎల్‌ఐసి జవాబుదారీగా ఉంటుంది.
* ఎల్‌ఐసి పాలసీదారుడు అనుభవిస్తున్న సావరిన్ గ్యారెంటీ ఎలిమెంట్ ఐపిఓ తర్వాత నిష్క్రమించడం మానేయవచ్చు.