షాకింగ్ : Windows 7 ఇక పనిచేయదు.. ఈ ఒక్కరోజే!

మీరు వాడే ఆపరేటింగ్ సిస్టమ్ (OS) ఏంటి? విండోస్ 7 వాడుతున్నారా? మీకో షాకింగ్ న్యూస్.. జనవరి 14, 2020 (మంగళవారం) నుంచి విండోస్ 7 పనిచేయదు. ఈ OSకు సంబంధించి సపోర్ట్ అధికారికంగా నిలిపివేయనున్నట్టు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ ఇకపై నుంచి మీ కంప్యూటర్లలో వాడటం కుదరదు అని అధికారిక బ్లాగ్ పోస్టులో తెలిపింది. ఇప్పటినుంచే Microsoft Windows 7 యూజర్ల సిస్టమ్ ఫుల్ స్ర్కీన్ పై వార్నింగ్ మెసేజ్ డిస్ ప్లే చేయనుంది.
జనవరి 15, 2020 నుంచి విండోస్ 7 వాడే యూజర్లకు ఈ వార్నింగ్ మెసేజ్ కనిపించనుంది. విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ వాడే యూజర్లంతా వెంటనే Windows 10 వెర్షన్‌లోకి Upgrade చేసుకోవాలని హెచ్చరిస్తోంది. విండోస్ OS మార్చుకునేంత వరకు యూజర్ల కంప్యూటర్ స్ర్కీన్ పై Pop Up మెసేజ్ కంటిన్యూగా డిస్ ప్లే అవుతుంది. విండోస్ 7 సర్వీసు ప్యాక్ 1 ఆపరేటింగ్ సిస్టమ్ వాడే (Starter, Home Basic, Home Premium, Professional) వెర్షన్లలో Full-Sreen నోటిఫికేషన్ కనిపించనుంది.
విండోస్ 7 ప్రొఫెషనల్ వెర్షన్ వాడే యూజర్లలో ఎవరైనా Extended Security Update (ESU) కొనుగోలు చేసినట్టు అయితే వారికి మాత్రం ఎలాంటి సమస్య ఉండదు. వీరి సిస్టమ్స్ లో వార్నింగ్ నోటిఫికేషన్ కనిపించదు. జనవరి 2023 వరకు ఈ ESU సెక్యూరిటీ అప్ డేట్ అందుబాటులో ఉంటుంది. ఒక్కో డివైజ్ పై ESU అప్ డేట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది దీని ధర పెరుగుతూ పోతుంది. అదనంగా డొమైన్ జాయిన్డ్ మిషన్స్, KIOSK మోడ్ మిషన్స్ లో మాత్రం ఎలాంటి వార్నింగ్ నోటిఫికేషన్ రాదు.
జనవరి 14 తర్వాత కూడా ఇదే విండోస్ 7 వెర్షన్ వాడితే ఆయా యూజర్లకు సెక్యూరిటీ పరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ హెచ్చరిస్తోంది. ఏమైందిలే అని అలానే విండోస్ 7 వాడితే హ్యాకర్లకు ఈజీగా చిక్కడమే కాకుండా OS టెక్నికల్ ఇష్యూలు తలెత్తుతాయి. విండోస్ 7 వాడే యూజర్లంతా వెంటనే బెస్ట్ అప్ డేట్ కు మారిపోతే మంచిది అంటున్నారు టెక్ నిపుణులు.. విండోస్ 7 యూజర్లంతా Windows 10 Full Version Upgrade చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ అలర్ట్ చేస్తోంది. కానీ, కొంతమంది యూజర్లు Free Version కోసం ప్రయత్నిస్తుంటారని, ప్రస్తుతం అలాంటిది ఏమి లేదని Microsoft స్పష్టం చేసింది.