ట్యూషన్ కు వచ్చిన విద్యార్ధిపై అత్యాచారం చేసిన మాస్టార్

ట్యూషన్ కోసం ఇంటికి వచ్చిన విద్యార్ధిపై అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అహ్మదాబాద్ లో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న 21 ఏళ్ల ట్యూటర్ వద్ద ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 12 ఏళ్ళ విద్యార్ధి చేరాడు. లాక్ డౌన్ కారణంగా గత 2 నెలలుగా ట్యూషన్ మాస్టర్ ఇంటి వద్ద నుండి ఆన్ లైన్ లో క్లాసులు చెప్పాడు.
దేశవ్యాప్తంగా అన్ లాక్ మొదలైన తర్వాత ఇంటి వద్దకు విద్యార్ధులను పిలిచి ట్యూషన్ చెప్పటం ప్రారంభించాడు. మిగిలిన సిలబస్ త్వరగా పూర్తి చేస్తాను అని చెప్పి 12 ఏళ్ళ విద్యార్దిని ఇంటికి రమ్మని చెప్పాడు. విద్యార్ధి నాలుగైదు రోజులు ట్యూషన్ కి వెళ్లి వచ్చాడు. తర్వాత ట్యూషన్ కు వెళ్లటం మానేశాడు. తల్లి తండ్రులు కూడా కరోనా వ్యాప్తి సమయం కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు.
కానీ ఇటీవల తన మర్మాంగం వద్ద నొప్పి గా ఉందని బాధ పడటం మొదలెట్టాడు. తల్లి తండ్రులు అతడిని డాక్టరు దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడ విద్యార్ది అసలువిషయం చెప్పాడు. తన ట్యూషన్ మాస్టర్ తనపై అత్యాచారం చేశాడని, ఈవిషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడని చెప్పాడు. ఇది ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరిస్తూ 4,5 సార్లు తనపై అత్యాచారం చేసినట్లు బాలుడు వివరించాడు.
అందుకు భయపడే ట్యూషన్ కు వెళ్లకుండా ఎవరికీ చెప్పకుండా ఉన్నట్లు విద్యార్ధి రోదించాడు. దీంతో విద్యార్ధి తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లి తండ్రుల ఫిర్యాదు ఆధారంగా ఉపాధ్యాయుడిపై ఐపీసీ సెక్షన్ 376, 506లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి… ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు.