Jeffrey: ఇతడు కీచకుడు, రావణుడి కంటే ఘోరం.. బయటపడిన మరిన్ని సంచలనాలు 

అందులోని అతడి ఆఫీసు డెస్కులో అతడి బాధిత అమ్మాయిల నగ్న ఫొటోలు ఉన్నాయని ఆ యువతి పేర్కొంది.

Jeffrey: ఇతడు కీచకుడు, రావణుడి కంటే ఘోరం.. బయటపడిన మరిన్ని సంచలనాలు 

Jeffrey Epstein

జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్‌స్టీన్.. అమెరికాలో ఫైనాన్షియర్.. మహిళలు, బాలికలను పని కోసం పిలిపించుకుని వారిపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్‌స్టీన్ కేసు అమెరికాలో సంచలన సృష్టించింది. ఈ కేసుకు సంబంధించిన తాజాగా మరిన్ని వివరాలు తెలిశాయి.

జెఫ్రీ బాధితురాలు, వర్జీనియాకు చెందిన గియుఫ్రే కోర్టుకు పలు వివరాలు తెలిపింది. అమ్మాయిల అక్రమ రవాణాలో జెఫ్రీకి అతడి ప్రియురాలు గిస్లైన్ మాక్స్​వెల్ సాయపడేదని చెప్పింది. న్యూయార్క్ సిటీ టౌన్‌హౌస్‌లో ది డన్‌జియాన్ పేరిట జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్‌స్టీన్ కి ఓ భవనం ఉందని చెప్పింది. అందులోని అతడి ఆఫీసు డెస్కులో అతడి బాధిత అమ్మాయిల నగ్న ఫొటోలు ఉన్నాయని పేర్కొంది.

అదో రహస్య గది అని తెలిపింది. అవన్నీ చాలా అసభ్యకరంగా ఉంటాయని చెప్పింది. తనతో పాటు మరో అమ్మాయికి చెందిన పెయింటింగ్స్ కూడా ఆ రూమ్ లో ఉన్నాయని చెప్పింది. అతడి మసాజ్ గదిలోనూ నగ్న ఫొటోలు ఉంటాయని పేర్కొంది.

జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్‌స్టీన్ కేసు ఇంత సంచలనంగా ఎందుకు మారిందో తెలుసా?
అమెరికా మాజీ అధ్యక్షులతో పాటు అనేక మంది పెద్దవారితో పరిచయాలు ఉన్నాయి జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్‌స్టీన్‌కి. అతడికి కనీసం కాలేజీ డిగ్రీ లేదు. అయినప్పటికీ తప్పుడు పత్రాలతో ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేశాడు. అతడిని 1976లో టీచర్ ఉద్యోగం నుంచి స్కూల్ యాజమాన్యం తొలగించింది. ఆ తర్వాత జెఫ్రీ ఎప్‌స్టీన్ బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టార్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

సొంతంగా కంపెనీ పెట్టుకున్నాడు. మహిళలు, చిన్నారుల జీవితాలతో ఆడుకున్నాడు. వారితో వ్యాపారం చేశాడు. తన స్నేహితులతో కలిసి ఇటువంటి అక్రమాలకు పాల్పడ్డాడు. బాలికలను సైతం వదలకుండా వారిని లోబరుచుకున్నాడు. చివరకు అతడి నేరాలు బయటపడ్డాయి. 2008లో అతడిని కోర్టు దోషిగా తేల్చింది.

అతడు 36 మంది బాలికలను (వారిలో కొందరికి 14 ఏళ్లలోపు వయసు ఉంటుంది) కూడా శారీరకంగా వాడుకున్నారని నిర్ధారణ అయింది. జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. ఆ తర్వాత కూడా పలు ఆరోపణలు వచ్చాయి. చివరకు ఎప్‌స్టీన్ 2019లో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

అతడి కేసుకు సంబంధించిన పత్రాలను ఇటీవల అమెరికా కోర్టు విడుదల కూడా చేసిన విషయం తెలిసిందే. వాటి ద్వారా సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మహిళలను అతడు తన రిసార్ట్‌లో పని చేయడానికి రప్పించేవాడు. ఇంకొంత మంది మహిళలను తీసుకొస్తే కమీషన్ ఇస్తానని ఇప్పటికే ఉన్న మహిళతో చెప్పేవాడు.

జెఫ్రీకి ఓ ప్రియురాలు ఉండేది. ఆమె కూడా బాలికలను అక్రమంగా రవాణా చేయించి తీసుకొచ్చేది. ఆమెకు 2022లో జైలు శిక్ష విధించారు. రిసార్టులో కస్టమర్లకు మసాజ్ చేయడానికని మహిళలు, బాలికలను పనిలో పెట్టుకున్న జెఫ్రీ ఎప్‌స్టీన్ వారితో సన్నిహితంగా మెలిగేవాడు. తన కోరికలను తీర్చుకునేవాడు. దీనిపైనే ఇప్పటికీ విచారణ జరుగుతోంది.

Viral Video : వార్నీ .. ఈ ఎద్దుకి బ్యాంకులో పనేంటబ్బా.. అసలు లోపలికి ఎలా వచ్చింది?