Viral Video : వార్నీ .. ఈ ఎద్దుకి బ్యాంకులో పనేంటబ్బా.. అసలు లోపలికి ఎలా వచ్చింది?

కొన్ని జంతువులు అకస్మాత్తుగా కార్యాలయాల్లోకి వచ్చిన సంఘటనల గురించి విన్నాం. అలాంటిదే ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. బ్యాంకులో ఎద్దు ప్రత్యక్షమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Viral Video : వార్నీ .. ఈ ఎద్దుకి బ్యాంకులో పనేంటబ్బా.. అసలు లోపలికి ఎలా వచ్చింది?

Viral Video

Updated On : January 11, 2024 / 3:59 PM IST

Viral Video : ఓ ఎద్దు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వచ్చింది. బ్యాంకు లోపల స్వేఛ్చగా తిరిగింది. దానిని చూసి కస్టమర్లంతా షాకయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Hanuman : మూడేళ్ళ క్రిందటే చిరంజీవి.. ‘హనుమాన్’ సినిమా గురించి చెప్పారా.. వీడియో వైరల్

దారి తప్పిన ఓ ఎద్దు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియ బ్రాంచ్‌లోకి వచ్చిన సంఘటన ఉత్తరప్రదేశ్ ఉన్నావ్‌లోని షాగంజ్‌లో జరిగింది. ఎద్దు లోపలికి రావడంతో బ్యాంకు సిబ్బంది, కస్టమర్లు షాకయ్యారు. 30 సెకండ్లపాటు క్యాప్చర్ అయిన వీడియోలో బ్యాంకులోనికి ప్రవేశించిన ఎద్దు ఓ మూలన నిలబడి ఉంది. ఆ తర్వాత కౌంటర్ దాటి నడుస్తుంది. దాంతో కస్టమర్లు, బ్యాంక్ సిబ్బంది కంగారుపడ్డారు. సెక్యూరిటీ గార్డు దానిని కర్రతో తరిమి కొట్టడానికి ప్రయత్నించాడు. అసలు ఈ ఎద్దు లోపలికి ఎలా వచ్చింది? అంటే..

Aamir Khan : మొదటి భార్య కూతురి పెళ్ళిలో.. రెండో భార్యతో ఆమిర్ స్టెప్పులు.. వీడియో వైరల్

మొదట రెండు ఎద్దులు ఘర్షణ పడ్డాయట. అందులో ఒకటి మరో ఎద్దును వెంబడించినప్పుడు బ్యాంకు తలుపులు తెరిచి ఉండటంతో ఎద్దు లోపలికి వచ్చేసిందట. దాంతో కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇంకా నయం .. ఆ సమయంలో బ్యాంకులో కస్టమర్లు తక్కువమంది ఉండటంతో ఎవరికీ ఇబ్బంది కలగలేదు. ఈ విషయాన్ని బ్యాంక్ చీఫ్ మేనేజర్ గౌరవ్ సింగ్ వెల్లడించారు. గతంలో ఇలాగే అసోం ధుబ్రీ జిల్లాలోని ఓ మాల్ బట్టల దుకాణంలో ఆవు స్వేచ్ఛగా తిరగడం వైరల్ అయ్యింది.