నదిలో పడ్డ ట్రక్కు….ఏడుగురు మృతి

  • Published By: murthy ,Published On : November 16, 2020 / 04:46 PM IST
నదిలో పడ్డ ట్రక్కు….ఏడుగురు మృతి

Updated On : November 16, 2020 / 5:03 PM IST

Major accident in Himachal Pradesh’s Mandi : హిమాచల ప్రదేశ్ లోని మండి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలను తీసుకువెళుతున్న ట్రక్కు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు మరణించగా డ్రైవర్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.
hp road accidentమండి గ్రామంలోని టెంట్ హౌస్ లో పని చేయటానికి కొందరు కూలీలు బీహార్ నుంచి మండి వచ్చారు. అర్ధరాత్రి సమయంలో బస్టాండ్ కు చేరుకున్న వారిని తీసుకువెళ్లేందుకు టెంట్ హౌస్ కు చెందిన వ్యాను బస్టాండ్ కు వచ్చింది. కూలీలు వ్యాన్ లో ఎక్కి వెళుతుండగా తెల్లవారుఝూమున 3 గంటల సమయంలో… మండి సమీపంలోని పుల్ గ్రాట్ వద్ద సుకేతి ఖుడ్ నదిలో పడిపోయింది.



వ్యాన్ లో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా…గాయపడిని ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరోక వ్యక్తి మరణించాడు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ చికిత్స పొందుతున్నాడు.