ప్రాణం తీసిన మద్యం పందెం

  • Published By: murthy ,Published On : October 24, 2020 / 08:35 AM IST
ప్రాణం తీసిన మద్యం పందెం

Updated On : October 24, 2020 / 9:06 AM IST

man died drinking raw alcohol : మిత్రులు అందరూ కలిసి సరదాగా మందు పార్టీ చేసుకుంటున్నారు. అందులో ఇద్దరూ పందెం వేసుకున్నారు. మద్యంలో నీరు,సోడా కలపకుండా తాగాలని…. అలా తాగిన ఒక వ్యక్తి ప్రాణాలుకోల్పోయిన ఘటన బాన్సువాడలో జరిగింది.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ, శాంతినగర్ లో నివసిచే ఎస్.సాయిలు(40) తన ఐదుగురు మిత్రులతో కలిసి మద్యం సేవించటానికి పట్టణ శివారులోని పంట పొలానికి వెళ్లారు. అక్కడ అందరూ మద్యం సేవిస్తుండగా…..మాటల మధ్యలో సాయిలు, మరో మిత్రుడి మధ్య వాదన పెరిగి బెట్టింగ్ కు దిగారు.



మద్యంలో నీరు, సోడా కలపకుండా ఫుల్ బాటిల్ తాగాలని పందెం కాసుకున్నారు. సాయిలు మరో మిత్రుడు ఇద్దరూ రెండు ఫుల్ బాటిల్స్ తెప్పించి పందెం ప్రకారం నీరు, సోడా కలపకుండా తాగారు. తాగిన తర్వాత ఇద్దరూ మత్తులోకి జారిపోగా మిగిలిన మిత్రులు వారిద్దరినీ వారి వారి ఇళ్లదగ్గర దింపారు.



కాగా…సాయిలు ఇంటికి వెళ్లిన తర్వాత వాంతులు విరోచనాలు చేసుకుని స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడ్ని ఏరియా ఆస్పత్రికితీసుకువెళ్ళారు. పరీక్ష చేసిన డాక్టర్లు అప్పుటికే అతను మరణించినట్లు తెలిపారు.